నెగ‌టివ్‌లో పాజిటివ్ చూడాల‌ని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో భ‌యాందోళ‌న చెందుతున్న విష‌యం తెలిసిందే. దీని ప్ర‌భావంతో ప్ర‌పంచంలోని ప్ర‌తీ రంగం ప్ర‌భావిత‌మైంది. ఆర్థిక‌రంగానికైతే కోలేకోలేని దెబ్బ త‌గిలింది. చైనా, ఇట‌లీ, అమెరికా, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, స్పెయిన్‌, భారత్ లాంటి దేశాల్లో వేలాది ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డే ద‌శ‌కు చేరుకున్నాయి. అయితే భార‌త్‌పై ఇంకా అంత తీవ్రంగా ప్ర‌భావం చూప‌క‌పోయిన భ‌విష్య‌త్‌పై మాత్రం మాత్రం ఆందోళ‌న నెల‌కొంది. ఇక ఇప్ప‌టికే చైనాపై ప్ర‌తాపం చూపిన క‌రోనా..ఇటలీపై త‌న ఉగ్ర‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించింది. నేడు దాని చూపు ఇండియాపై ప‌డింది. 

అయితే ఆదిలోనే దీన్ని క‌ట్టడి చేసేందుకు భార‌త ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకుంటూనే ఉంది. అందులో భాగంగానే ప్ర‌ధాన‌మంత్రి నేడు  జ‌న‌తా క‌ర్ఫ్యూకు పిలుపునివ్వ‌డంతో దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రిని నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇదిలా ఉండ‌గా చాలా కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌లు ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోంకు అవ‌కాశం క‌ల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్ప‌టికే వంద‌లాది మ‌ల్టీనేష‌న్ కంపెనీలు ప్ర‌క‌టించాయి కూడా. ఇలాంటి సంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు  సూచిస్తున్నారు. ఆధునిక ప‌రిస్థితుల్లో అంద‌రి జీవితాలు యాంత్రికంగా త‌యారైన విష‌యం తెలిసిందే. ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అన్న‌ది క‌త్తిమీద సాములా మారింది.


ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌రోనా పిడుగులాంటి వార్తే అని చెప్పాలి. వ‌ర్క్ ఫ్రం హోం, జ‌న‌తా క‌ర్ఫ్యూను పాజిటివ్ కోణంలో చూడాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ క‌నీసం ఆరుగంట‌ల నుంచి 8గంట‌ల వ‌ర‌కు కంటినిండా నిద్ర‌పోవాల‌ని సూచిస్తున్నారు. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంద‌ని, క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొంనేందుకు కూడా దోహ‌దం చేస్తుంద‌ని చెబుతున్నారు.ద్వారా శ‌రీరంలో ఇమ్యూనిటీ మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఇది క‌రోనాకు దివ్వ ఔష‌ధం కూడా! అంటూ సూచిస్తున్నారు. మ‌రి అంద‌రూ జ‌న‌తా క‌ర్ఫ్యూలో పాల్గొని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న‌ట్లుగా ఎంచ‌క్కా హాయిగా నిద్ర‌పోదాం..క‌రోనాను త‌రిమికొడ‌దాం..!

మరింత సమాచారం తెలుసుకోండి: