ఇండోనేషియాకు చెందిన తొమ్మిది మందికి ఆశ్రయం కల్పించిన మహమ్మద్‌ జమీల్‌ అహ్మద్‌ను క‌రీంన‌గ‌ర్‌ పోలీసులు శ‌నివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇండోనేషియా స‌భ్యుల్లో ఏడుగురికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు ప‌రీక్ష‌ల్లో నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. దాంతో జ‌మీల్‌కు కూడా సోకి ఉంటుంద‌నే అనుమానంతో  వైద్య పరీక్షల కొరకు నగరంలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అత‌డి ర‌క్త న‌మూనాల‌ను కూడా  వైద్యులు అదే రోజు రాత్రి సేక‌రించి పంపించారు. వైద్యుల అనుమానం నిజ‌మైంది.  పరీక్షల్లో జమీల్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది.  జమీల్‌పై అధికారులు ఆసుపత్రిలోని ఐసోలేష‌న్ వార్డులో ఉంచారు. అక్క‌డే విచార‌ణ కూడా చేప‌ట్టారు. 

 

ఇండోనేషియా వాసులు క‌రీంన‌గ‌ర్‌కు ఎందుకు వ‌చ్చిన‌ట్లు అనే విష‌యంపై ఆరా తీస్తున్నారు. వారికి ఎలాంటి అనుమ‌తుల్లేకు న్నా క‌రీంన‌గ‌ర్‌కు రావ‌డంపై ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. కరీంనగర్‌లో పర్యటనకు వచ్చిన ఇండోనేషియా వాసులకు ఆశ్రయం ఇచ్చిన మహమ్మద్‌ జమీల్‌ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకుల సహచరులు కరీంనగర్‌లో నాలుగు నెలలుగా పర్యటిస్తున్న‌ట్లుగా పోలీసులు భావిస్తున్నార‌ట‌.  గత నెల జగిత్యాలలో ఓ నిషేధిత సంస్థ నిర్వహించిన ఆవిర్భావ సభలో నాలుగు జంటల బృందం పాల్గొంద‌ని తెలుస్తోంది.

 


 కరీంనగర్‌ రూరల్‌ ఏరియాలో పర్యటించిన బృందం ఇప్పుడెక్కడుంది..?  కరీంనగర్‌లో ఇండోనేషియా బృందాలకు ఏం పని ? అనే కోణంలో సీరియ‌స్‌గా ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరు ఎవ‌రెవ‌రిని క‌లిశారు. వారికి వైర‌స్ సోకిందా..అన్న‌కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. వాస్త‌వానికి ఇండోనేషియా బృందం పోలీసుల‌కు చిక్క వారికి క‌రోనా నిర్ధార‌ణ అయిన విష‌యం తెలియ‌డంతో జమీల్‌ అహ్మద్‌ కొన్ని రోజులుగా పోలీసులకు దొరకుండా తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైరస్‌ సోకిందన్న అనుమానంతో వైద్య పరీక్షలకు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: