క‌రోనాకు మందు క‌నుగొన్న విష‌యంపై ప్ర‌పంచ వ్యాప్తంగా భిన్న ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డుతున్నాయి. ఒక్కో దేశం ఒక్కో విధంగా  పొంత‌న‌లేని మందుల ప్ర‌క‌ట‌న‌ను చేస్తుండ‌టం విశేసం. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనాకు తాము మందు క‌నుగొన్నామ‌ని ఇజ్రాయిల్ దేశం ప్ర‌క‌టించింది. ఎయిడ్స్ మ‌రియు ఫ్లూ వ్యాధిని నిరోధించే మందుల‌తో క‌లిపి కొత్త ఫార్మూల‌తో కరోనా నివార‌ణ మందు తయారు చేసిన‌ట్లుగా చెప్పింది. అంతే కాదు..ఆ మందును ప్ర‌యోగించి మంచి ఫ‌లితాలు రాబ‌ట్టిన‌ట్లు కూడా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా మ‌లేరియాకు వాడే వ్యాక్సిన్‌నే క‌రోనాకు వాడితే స‌రిపోతుంద‌ని, తాము ప్ర‌యోగించి స‌త్ఫ‌లితాలు రాబ‌ట్టిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అధికారికంగా వెల్ల‌డించ‌డం విశేషం. 

 

ఇక మ‌రోవైపు క‌రోనా వైర‌స్‌ను క‌నుగొన్న చైనా దేశంలో 80వేల‌మందికి పైగా  రోగులు వైద్యం పొందుతున్నారు. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇక్క‌డ చాలా మంది రిక‌వ‌రీ స్టేజిలో ఉన్నారు. గ‌డిచిన నాలుగైదు రోజుల్లో పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. హువాయిలాంటి ప్ర‌దేశాల్లో అయితే కొత్త కేసులు న‌మోదు కాక‌పోవ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా చైనా ఇప్ప‌టికే వైర‌స్‌కు మందును క‌నుగొన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. లేదంటే ఇంత పెద్ద మొత్తంలో వేగంగా రోగుల రిక‌వ‌రీ జ‌రిగి ఉండ‌ద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తంమ‌వుతున్నాయి. అయితే ఈ విష‌యంలో డ్రాగ‌న్ దేశం మాత్రం ఎలాంటి స్పంద‌న‌ను వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ప్ర‌క‌టించిన‌ట్లుగా క‌రోనాకు మందు క‌నుక్కోగ‌లిగితే మాన‌వాళికి పెనుప్ర‌మాదం త‌ప్పిన‌ట్లేన‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. 

 

మ‌రోవైపు చైనాలో కరోనా వేగంగా వ్యాప్తిచెందడానికి ‘వ్యాధి ఉన్నా.. లక్షణాలు బయటపడని’ కేసులే ప్రధాన కారణమయ్యాయని అమెరికాలోని కొలంబియా వర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. జనవరి 23న వూహాన్‌కు ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి ప్రజల రాకపోకలపై నిషేధం విధించినప్పటి నుంచే పరిస్థితి ఒకింత అదుపులోకి వచ్చిందని తెలిపారు. అయితే అంతకుముందు (జనవరి 10-23 మధ్యకాలంలో) కరోనా లక్షణాలు లేనివారిపై అక్కడి వైద్యయంత్రాంగం పెద్దగా దృష్టిసారించకపోగా, ప్రజల రాకపోకలపైనా పెద్దగా ఆంక్షలు విధించలేదని పేర్కొన్నారు. ఫలితంగా లోలోపల కరోనా ఇన్ఫెక్షన్‌ ఉన్నవారి నుంచి ఇంకొందరికి.. ఆ కొందరి నుంచి మరికొందరికి కరోనా వేగంగా ప్రబలిందని చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: