క‌రోనా వైర‌స్‌కు క‌ళ్లెం వేసేందుకు త‌గిన మందును క‌నుగోనేందుకు ప్రపంచ‌వ్యాప్తంగా వేలాదిమంది శాస్త్ర‌వేత్త‌లు రేయిబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే కొత్త మందు క‌నుగొనే అవ‌స‌రం లేకుండానే మ‌లేరియా నివార‌ణ‌కు వినియోగిస్తు న్న  క్లోరోక్విన్ మెడిసిన్ క‌రోనా నివార‌ణ‌కు కూడా ప‌నిచేస్తుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైందని, ఇందుకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ముందు జాగ్రత్తగా ఈ మాత్రలను వేసుకోవడం వల్ల  సత్ఫలితాలు వస్తున్నాయని  ప్రముఖ వైద్యుడు రవిచంద్ర బీరం  మీడియా ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు.  

 

క్లోరోక్విన్‌ లేదా హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు అజిత్రోమైసిన్‌ తీసుకోవడం ద్వారా కరోనాను నాలుగైదు రోజుల్లో నియంత్రించవచ్చని చెబుతున్నారు. ‘‘చైనాలో ఈ మందు వాడినందు వల్లే అక్కడ కరోనా నియంత్రణలోకి వచ్చిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. క్లోరోక్విన్‌తో కరోనా నియంతిరంచవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ప్రకటించారు. కానీ, శాస్త్రీయ ఆధారాలు లేవంటూ దీనికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆధారాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి’’అని ఆయన చెప్పారు. వాస్త‌వానికి నాలుగైదు రోజుల క్రితం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూడా ఇదే విష‌యాన్ని చెప్పారు. కొత్త‌మందు అవ‌స‌రం లేకుండానే మ‌లేరియా వ్యాధినివార‌ణ‌కు ఉప‌యోగిస్తున్న మందుల‌నే వాడితే స‌రిపోతుంద‌ని వెల్ల‌డించారు.

 

క‌రోనా బాధితుల‌ను బ‌య‌ట‌ప‌డేసేందుకు వారు కూడా ఇదే మందును వాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే క్లోరోక్విన్ క‌రోనాపై ఏవిధంగా ప‌నిచేస్తుంది, భ‌విష్య‌త్‌లో దీనివ‌ల్ల శ‌రీరంలో ఎలాంటి మార్పులు చేసుకుంటాయి అనే దానిపై క‌చ్చిత‌మైన అంచ‌నాకు నిపుణులు రాలేక‌పోయార‌ని స‌మాచారం. అయితే స‌త్ఫ‌లితాలిస్తుండ‌టంతో ఇప్ప‌టికైతే ఈ మందునే రోగుల‌కు అంద‌జేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా భార‌త ప్ర‌భుత్వం కూడా క్లోరోక్వీన్ పంపిణీపై ఓ నిర్ణ‌యానికి రానున్న‌ట్లుగా తెలుస్తోంది. భార‌త్ వైద్య నిపుణుల నివేదిక అనంత‌రం కేంద్రం ఆదేశాలు వెల్ల‌డికానున్న‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: