కరోనా భయంతో వణుకుతున్న ప్రజలకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తీపి క‌బురు చెప్పింది. క‌రోనాపై ప్రాథ‌మిక ప‌రిశోధ‌న‌లు, ప‌ర్య‌వ‌స‌నాల‌పై  విశ్లేష‌ణ చేసిన ఐసీఎంఆర్ చివ‌రికి హైడ్రాక్సీ క్లోరోక్విన్.క‌రోనాకు విరుగుడుగా ప‌నిచేస్తుంద‌ని తేల్చేసింది. ఈమేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేసింది.  కరోనా రోగులతో పాటు వారి  కుటుంబ స‌భ్యులు, బంధువులు కూడా ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఈ టాబ్లెట్స్ తీసుకోవచ్చ‌ని చెప్పింది. అయితే ఇత‌ర‌త్రా ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు ఎవ‌రైనా  డాక్టర్ల సూచన మేరకే వాడాల‌ని సూచించింది.

 

 క‌రోనా పాజిటివ్‌గా ఉన్న‌వారు, అనుమానిత ల‌క్ష‌ణాలు క‌లిగి ఉన్నావారెవ‌రైనా క్లోరోక్వీన్ వాడుతున్నా... క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. ఈ మందుల వాడ‌కం వ‌ల్ల ఎలాంటి దుష్ప్ర‌భావాలు క‌లిగినా వెంట‌నే త‌మ దృష్టికి తీసుకురావాల‌ని పేర్కొంది.  జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తున్న సమయంలో ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. అయితే 15 ఏళ్లలోపు చిన్నారుల్లో మాత్రం కోవిడ్ ముందస్తు నివారణ కోసం ఈ ఔషధాన్ని ఉపయోగించకూడదని హెచ్చరించింది. కరోనా వైరస్ సోకే ముప్పు ఉన్నవాళ్లు మాత్ర‌మే ఈ క్లోరోక్వీన్ మాత్రాలు  వేసుకోవాల‌ని సూచించింది.

 

ఇదిలా ఉండగా క్లోరోక్వీన్ మాత్రాలు దేశంలో కావాల్సిన‌న్ని నిల్వ ఉన్న‌ట్లు స‌మాచారం. దేశ వ్యాప్తంగా  విడ‌త‌ల వారీగా పంపిణీకీ త్వ‌ర‌లోనే కేంద్రం ఆదేశాలు జారీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే క‌రోనా దీంతో పూర్తిగా క‌ట్ట‌డి అవుతుందా అంటే దాని ప‌ర్య‌వస‌నాలు ఇప్పుడే పూర్తిగా తెలియ‌వ‌ని ఐసీఎంఆర్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అయితే ఈ మందులు తీసుకుంటున్నాం కదా మనకేం కాదు అన్న అజాగ్రత్త వద్దంటున్నారు ఐసీఎంఆర్ అధికారులు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలంటున్నారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వైర‌స్ పూర్తిగా స‌మ‌సిపోయింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చేంత వ‌ర‌కు ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూనే ఉండాల‌ని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: