ప్రపంచం అంతా కరోనా భూతం గురించే మాట్లాడుకుంటున్నారు.  కరోనా ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే పేరు మారుమోగిపోతోంది.  దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా బీభత్సం సృష్టిస్తుంది. అయితే కరోనా అరికట్టేందేకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. కరానా వైరస్ సోకితే వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటూనే ఉన్నారు.   దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 500కి చేరుకున్నాయి. నిన్న ఒక్క రోజే 99 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 10 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరోవైపు ప్రధాని మోదీ  ఈ విపత్కర సమయంలో అందరం కలిసి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

 

ఐకమత్యంగా కరోనాను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. 21 రోజుల తర్వాత కరోనా మహమ్మారిపై విజయం సాధించబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే కరోనా రాకుండా ఇప్పుడు ఓ మంచి ఔషదం దొరికిందని అంటున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రధానంగా ప్రకృతి వైద్యంపై అందరి దృష్టిపడింది. అలోవెరాతో ఆరోగ్యాన్ని కాపాడు కునేందుకు ప్రయత్నిస్తున్నారు జనం. ప్రకృతి పరంగా లభించే అలోవీరాకు గుంటూరులో ఇప్పుడు తెగ డిమాండ్ ఏర్పడింది..అలోవీరలో రోగనిరోధక శక్తి ఉండటంతో పాటుగా శరీరంలోని అనేక రుగ్మతను కంట్రోల్ చేసే శక్తి ఉంది.

 

అత్యంత కీలకమైన రక్తప్రసరణను వేగవంతం చేసే అలోవీరను కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వినియోగిస్తున్నారు. ఇంకేముంది ఇప్పుడు జనాలు సాధ్యమైనంత వరకు అలవేరా ఇంట్లో జ్యూస్ చేసుకుంటున్నారు.. సాధ్యం కాని వారు బయట ఈ జ్యూస్ కోసం పరుగులు పెడుతున్నారు. కరోనా వైరస్ నేపధ్యంలో అయుర్వేద వైద్యంపై కొంతమంది మొగ్గు చూపుతున్నారు. అందులో భాగమైన అలోవీరకు క్రేజ్ ఏర్పడింది..రోగ నిరోధక శక్తి పెంచే అన్ని పదార్దాలపైన కూడా జనం ఇప్పటికే దృష్టి సారించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: