ఈ మధ్య కాలంలో మధుమేహం భారీన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ ను శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగితే ఈ సమస్య ఏర్పడుతుంది. డయాబెటిస్ భారీన పడిన వారు జాగ్రత్తలు తీసుకోకపోతే గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీలు ఫెయిల్ కావడం, తీవ్రమైన కంటి సమస్యలు రావడం, కాళ్లు లేదా పాదాలు తొలగించాల్సి రావడం లాంటి పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. 
 
ప్రతి సంవత్సరం డయాబెటిస్ రోగుల సంఖ్య కోట్లలో పెరుగుతూ ఉండటం గమనార్హం. ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటించటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. చక్కెర పానీయాలకు, చక్కెరతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూ ఒకే వేళకు ఆహారం తీసుకోవడం... కడుపు నిండగానే తినడం ఆపేస్తే షుగర్ భారీన పడకుండా జాగ్రత్త పడవచ్చు. 
 
ఎత్తుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్త వహించాలి. ఎక్కువ బరువు ఉంటే ఒకేసారి తగ్గడానికి ప్రయత్నించకుండా వారానికి కేజీ చొప్పున తగ్గడం మంచిది. శరీరంలో కొవ్వు స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం వల్ల కూడా షుగర్ భారీన పడే అవకాశం ఉంది. అందువల్ల ఆ అలవాటు ఉన్నవారు ధూమపానానికి దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి: