చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌కు పాకిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా క‌రోనా కోర‌ల్లో చిక్కుకున్న ఇట‌లీ, స్పెయిన్ దేశాలు విల‌విలాడుతున్నాయి. ఇట‌లీలో అయితే రోజూ వంద‌ల‌మంది చ‌నిపోతున్నారు. కొత్త‌గా వేలాది పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. వైర‌స్ వ్యాప్తిని ఎలా అరిక‌ట్టాలో అర్థం కాక‌..పాజిటివ్ రోగుల‌కు వైద్యం పూర్తిస్థాయిలో అందించ‌డానికి వైద్య స‌దుపాయాలు, సిబ్బంది లేక‌పోవ‌డంతో ప్రాణాలు గాలిలో క‌లిసిపోతున్నాయి. స్పెయిన్, ఇటలీల నుంచి  ప్రపంచానికి వినిపిస్తున్న కరోనా వైరస్ కదిలించే కథలు ఇప్పుడు అన్ని దేశాల‌కు షాక్ ఇస్తున్నాయి. ఈ రెండు దేశాలలో కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు ఈ వ్యాధికి లోనవుతున్నారు.

 

 ఇటలీలో గౌన్లు, గ్లోవ్స్, మాస్క్‌ల కొరత తీవ్రంగా ఉంది. అక్కడి వైద్యులు ప్రభుత్వానికి లేఖ రాస్తూ... మమ్మల్ని ఇలా వదిలిపెట్టడం తగదని విజ్ఞప్తి చేస్తున్నారు. మేం చేయ‌గ‌లిగే అన్ని ప్ర‌య‌త్నాల‌ను చేసేశాం. ఇక మా చేతుల్లో ఏం లేదు. మేము ఇప్పుడు ఆకాశం వైపు ఆశ‌గా చూస్తున్నాం. ఆ దేవుడే మా మీద ద‌య చూపి ఈ దేశ ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడాలంటూ ఇట‌లీ ప్ర‌ధాని బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు. రోగుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టంతో వారంద‌రికీ వైద్యం అందించ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది.దీనికితోడు దేశంలో శానిటైజ‌ర్లు, మాస్కుల కొర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ఈ స‌మ‌స్య ఇప్పుడు ఇట‌లీలో వైర‌స్ వ్యాప్తికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌వుతోంది.

 

యూనివర్సల్ హెల్త్ కేర్ గా గుర్తింపు పొందిన స్పెయిన్ ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. కరోనా రోగులు గుడారాలలో చికిత్స పొందుతున్నారు. స్పెయిన్‌కు చెందిన వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. స్పెయిన్ కు చెందిన 32 ఏళ్ల నర్సు కరోనా బారిన పడ్డారు. అయితే  వైద్య పరీక్షల తరువాత  కరోనా పాజిటివ్ అని తేలింది. త్వరలోనే  కోలుకుని ఆసుపత్రికి వెళ్తాన‌ని, పనిభారంతో బాధపడుతున్న తన సహోద్యోగులకు సహాయం చేస్తానని ఆ నర్స్  చెప్ప‌డం గ‌మ‌నార్హం. స్పెయిన్ ప్ర‌జ‌లను కాపాడ‌టం నా బాధ్య‌త అంటూ పేర్కొన‌డంతో ఆమెపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.  

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: