క‌రోనా సోకిందంటూ యువ‌తిపై అస‌త్య ప్ర‌చారంతో చేయ‌డంతో పాటు వేధింపుల‌కు గురి చేసిన యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈసంఘ‌ట‌న ఢిల్లీలో జ‌రిగింది. ఢిల్లీలోని విజ‌య్‌న‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న ఓ యువతి కిరాణ సామాన్లు కొన‌డానికి త‌న స్నేహితుడితో క‌లిసి బ‌య‌టికి వ‌చ్చింది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఆకతాయి యువతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. 
ఆమెకు క‌రోనా వైర‌స్ సోకిందంటూ, ఆమె ద‌గ్గర‌కు ఎవ‌రూ వెళ్లవ‌ద్దంటూ అవ‌మానించాడు. అంతేగాక ఆమెపై పాన్‌ను ఉమ్మాడు. దీంతో యువ‌తి త‌న త‌ల్లిదండ్ర‌లతో క‌ల‌సి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో స‌దరు యువ‌కుడిని అరెస్టు చేశారు.

 

కరోనా వైర‌స్ వ్యాప్తి అధిక‌మైనా కొద్ది చిత్ర‌విచిత్ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో నిషేధాజ్ఞ‌లు కొన్ని చోట్ల అమ‌లు కావ‌డం లేద‌ని స‌మాచారం. ఈమేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ‌ట్టి చ‌ర్య‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే రోడ్డుపై క‌నిపిస్తే లాఠీతో వీపు విమానం మోత మోగిస్తున్న కొంత‌మంది ఆక‌తాయిలు మాత్రం బైక్‌ల‌తో రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. దీంతో ఆర్మీని రంగంలోకి దించాల‌నే యోచ‌న‌లో ఉన్న కేంద్రం అది ఢిల్లీ నుంచే మొద‌లు పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌లుపై ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సంతృప్తి వ్య‌క్తం చేశార‌ట‌. అయితే ముంబైలో మాత్రం ప‌రిస్థితి అదుపు త‌ప్పుతోంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోందంట‌. 

 

ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా 20వేల మంది మ‌ర‌ణాల‌కు సంఖ్య‌కు చేరువ‌లో ఉంది. క‌రోనా వైర‌స్ రోజురోజుకీ మ‌రింత విస్తరిస్తూ ప్రపంచాన్ని కుదిపేస్తోంది.  ఇట‌లీ ప‌రిస్థితి రోజురోజుకు భ‌యానకంగా మారింది. స్పెయిన్‌లో వేల సంఖ్య‌లో కొత్త‌గా కేసులు న‌మోదవుతున్నాయి. ఇక అమెరికాలో కూడా వేగంగా వైర‌స్ విస్త‌రిస్తోంది. అగ్ర‌రాజ్యంలో మాస్కుల కొర‌త ఏర్ప‌డ‌టంతో క‌ఠిన చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ అల‌ర్ట్ అయింది. క‌రోనా వ్యాప్తిని ప్రాథ‌మిక ద‌శ‌లోనే క‌ట్ట‌డి చేసేందుకు \ చ‌ర్యలు తీసుకోవాల‌ని హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: