విజ‌య‌వాడ‌లో 3వ  క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు కావ‌డంతో హైటెన్ష‌న్ నెల‌కొంది. అధికారులు లాక్‌డౌన్‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా నిర్వ‌హిస్తున్నారు. రోడ్ల‌పైకి వ‌స్తున్న యువ‌కుల‌ను పోలీసులైతే లాఠీల‌తో బాదుతున్నారు. అయినా కొంత‌మంది యువ‌కులు త‌మ బుద్ధి మార్చుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  ఇప్ప‌టికే న‌గ‌రాన్ని రెండు జోన్లుగా విభజించి ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. వాడవాడలా శానిటేషన్‌ పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇక  కరోనా పాజిటివ్ కేసులు న‌మోదైన ప్రాంతాల్లో  రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అదే స‌మ‌యంలో నగరంలో ఇంటింటి ఫీవర్‌ టెస్ట్‌ సర్వే నిర్వ‌హిస్తున్నారు.  

 

విదేశాల నుంచి స్వ‌స్థలాల‌కు చేరుకున్న వారు త‌ప్ప‌క వివ‌రాలు తెలిపి క్వారంటైన్‌కు త‌ర‌లివెళ్లాల‌ని సూచిస్తున్నారు. గోప్యత వీడకపోతే కుటుంబంతో పాటు, ప్రజలు కూడా కరోనా బారినపడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. వివ‌రాలు వెల్ల‌డించ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం చ‌ట్టప‌ర‌మైన చ‌ర్య‌లు వెన‌కాడ‌బోమ‌ని తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై గురువారం రాత్రి కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలతలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు.మ‌రోవైపు త‌మ ప్ర‌య‌త్నంగా విదేశాల నుంచి వారి కోసం వలంటీర్లు వివ‌రాలు సేక‌రించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.

 

ఈ నెల 18న  స్వీడన్‌లోని స్టాక్‌హోం నుంచి విజయవాడకు వచ్చిన ఓ యువ‌కుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఢిల్లీకి వచ్చిన 28 ఏళ్ల ఆ యువకుడు.. అదే రోజు విజయవాడకు చేరుకున్నాడు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో 25న విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఆ యువకుడి నమూనాలను వెంటనే ల్యాబొరేటరీకి పంపించారు. గురువారం రాత్రి వచ్చిన రిపోర్టులో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ వ్యక్తి 18వ తేదీ నుంచి ఎక్కడెక్కడ తిరిగాడనే వివరాలన్నీ సేకరిస్తున్నారు. నగరంలో మూడు కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: