రాష్ట్రంలో పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌పై ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని అన్నారు. అవ‌స‌ర‌మైతే 60 వేల‌మందికి చికిత్స అందిచేందుకు వీలుగా ఆస్ప‌త్రుల్లో వ‌స‌తుల‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇందుకోసం ఎంబీబీఎస్ పూర్తి చేసిన, స‌ర్వీసుల్లో ఇంకా పై హోదాల్లో కొన‌సాగుతున్న‌, రిటైర్డ్ ఉద్యోగుల‌ను ప్ర‌త్యేక జీవో ద్వారా విధుల్లోకి తీసుకోవ‌డం ద్వారా, జూనియ‌ర్ డాక్ట‌ర్లు, ఎంబీబీఎస్ ఫైన‌ల్ చ‌దువుతున్న మెడికోల‌తో క‌లుపుకుని దాదాపు 11వేల మందికి పైగా  వైద్యుల‌ను సేవ‌ల‌కు వినియోగించుకోనున్న‌ట్లు తెలిపారు.

 

 గ‌చ్చిబౌలి స్టేడియంలో కొత్త‌గా 1400 ఐసీయూ బెడ్ల‌ను కూడా సిద్ధం చేసి ఉంచిన‌ట్లు తెలిపారు. ఇక మ‌రో 500 వెంటిలేట‌ర్ల‌ను ప‌క్క రాష్ట్రాల నుంచి తీసుకువ‌చ్చేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు.  ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 59 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని  కేసీఆర్ ప్రకటించారు. శుక్ర‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 10 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపారు. మరో 25 వేల మంది క్వారంటైన్లలో ఉన్నారని చెప్పారు. అయితే ప్ర‌భుత్వం మ‌రో వారం రోజుల త‌ర్వాత వ్యాధి ప్ర‌భావం జ‌నాల‌పై స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతుంద‌ని వైద్యులు చెబుతున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జా వ్య‌వ‌స్థ పూర్తిగా స్తంభించ‌డంతో వ్యాధి నిర్మూల‌న‌కు పాదులు ప‌డ్డాయి. క‌రోనా అనే మ‌హ‌మ్మారితో ప్ర‌పంచం మొత్తం యుద్ధం చేస్తోంద‌ని అన్నారు.

 

 ప్ర‌జ‌లెవ‌రూ అజాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించే స‌మ‌యం ఇది కాద‌న్నారు. పూర్తి జాగురుక‌త‌తో, ఎంతో చైత‌న్యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉంటుండ‌టం, ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో వ్యాధి వ్యాప్తికి అవ‌కాశాలు స‌న్న‌గిల్లిపోయిన‌ట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఏప్రిల్ 15వ‌ర‌కు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని, రాత్రి వేళల్లో క‌ర్ఫ్యూ కూడా అమ‌ల‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించ‌డంతో పాటు ప్ర‌జ‌లంద‌రికీ ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఎంతో ప‌క‌డ్బందీగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చెప్ప‌టడంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను నెటిజ‌న్లు దేశానికే ఆద‌ర్శ‌వంత‌మైన సీఎం, నాయ‌కుడ‌ని కొనియాడుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: