తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ ఉధృతి దాని ప‌ర్య‌వ‌స‌నాలు, ప్ర‌జ‌లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం విలేఖ‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. రాష్ట్రంలో నెల‌కొన్న తాజా ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూనే..ప్ర‌జ‌లంద‌రూ ఆరోగ్యంపై, క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు అనుస‌రించాల్సిన విధానాల‌ను తెలిపారు. 'తెలంగాణ సమాజానికి దండం పెట్టి చెబుతున్నా.. గత్తర బిత్తర కావొద్దు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాళ్లందరికి ఆహార వసతి ఏర్పాటు చేస్తాం.. ఎక్కడివాళ్లు.. అక్కడే ఉండండి. ఇతర రాష్ట్రాల ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్స్‌ మూసివేయరాదని,  అధికారుల దానిపై ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తార‌ని తెలిపారు. 

 

ఈ సంద‌ర్భంగా కొద్దిసేపు వైద్య నిపుణుడి లాగా  రోగ‌నిరోధక శ‌క్తి పెంపొందించుకోవాడానికి తీసుకోవాల్సిన ఆహారంపై ప్ర‌సంగించ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. తెలంగాణ ప్రాంతంలో పండే సి విట‌మిన్ ఎక్కువ‌గా ఉండే బ‌త్తాయి, దానిమ్మ‌తో పాటు ఇత‌ర ఫ్రూట్స్‌ను రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిద‌ని సూచించారు. అలాగే రాష్ట్రంలో పండిన బ‌త్తాయిలాంటి పంట‌లు ఇత‌ర రాష్ట్రాల‌కు ఎగుమ‌తి లేకుండా నిలిపివేయాల‌ని వెంట‌నే ఆదేశాలు జారీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. దీనివ‌ల్ల స్థానికంగా ఉండే ప్ర‌జ‌ల‌కు ఫ్రూట్స్ ల‌భ్య‌మ‌వుతాయ‌ని, అది అంద‌రికీ మేలు చేస్తుంద‌ని తెలిపారు. ఇక చికెన్ తిన‌డం వ‌ల్ల క‌రోనా వ‌స్తుంద‌ని కొంత‌మంది మూర్ఖులు ప్ర‌చారం చేశార‌ని అన్నారు.

 

 వాస్త‌వానికి చికెన్, కోడిగుడ్లు అనేవి బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహార‌మ‌ని, అవితింటే రోగాల బారిన ప‌డ‌మ‌ని, తిన‌కుంటే మాత్రం ప‌డే ఛాన్స్ ఉందంటూ త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌నించారు. ఇదిలా ఉండ‌గా  నిత్యావసరాలు, కూరగాయల కోసం ఇంటి నుంచి ఒక్కరే వెళ్లాల‌ని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి రీత్య రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల‌కు వ‌ల‌స వ‌చ్చిన కార్మికులను ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వ యంత్రాంగానికి సూచించారు. ఆహార వసతి కల్పించి.. వైద్య ప‌రీక్ష‌లు కూడా చేయించాల‌ని అన్నారు. ఇక రాష్ట్రంలోని . 50 లక్షలకుపైగా ఎకరాల్లో పంట చేతికొచ్చే సమయమిద‌ని అన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ, కాళేశ్వరం, నాగార్జునసాగర్‌, జూరాల ప్రాజెక్ట్‌ల కింద ఏప్రిల్‌ 10 వరకు నీటి సరఫరా చేయాలని ఆదేశాలిచ్చిన‌ట్లు తెలిపారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: