భారత్ లో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పదుల సంఖ్యలో పెరుగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 851కు చేరింది. కరోనా భారీన పడినప్పటికీ వ్యాధి నిరోధక శక్తి ఉన్నవాళ్లు ఈ వ్యాధిని జయిస్తున్నారు. లేనివాళ్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే కరోనా భారీన పడినా జయించే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలను తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 


 
రోజూ బ్లాక్ టీ, గ్రీన్ టీని తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనోల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చెడు చేసే కణాలను నశింపజేసి మేలు చేకూరుస్తాయి. ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటే వాటిలో ఏ, ఈ, సీ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నట్స్, డ్రై ఫూట్స్ దేహ నిర్మాణానికి దోహదం చేయడంతో పాటు దేహానికి కావాల్సిన శక్తినిస్తాయి. 


 
సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో మాంసాహారం తింటే కరోనా సోకుతుందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అసలు నిజం ఏమిటంటే మాంసాహారంలో ఐరన్, జింక్, ఓమేగా - 3, శరీరానికి అవసరమైన ప్రోటీన్లు ఉంటాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే వైరస్ ల భారీన పడినా శరీరంలో వాటికి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉండటంతో వ్యాధుల భారీన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: