క‌రోనా దేశంలో విజృంభిస్తూనే ఉంది. దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య శ‌నివారం ఉద‌యం నాటికి 873కు చేరుకున్న‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. అలాగే 19మంది రోగులు మృత్యువాత ప‌డ్డ‌ట్లు పేర్కొంది.  అయితే గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్త‌గా 149 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావ‌డం గ‌మ‌నార్హం. కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఇక ప్రపంచవ్యాప్తంగా 24 వేలకు పైగా మంది కరోనా బారిన పడి మరణించగా... 5 లక్షలకు మందికి పైగా ఈ మహమ్మారి సోకిన విషయం తెలిసిందే.

 

దీంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఏరిస్థితి ఎదురైన ఎదుర్కొనేందుకు సన్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వెయ్యి ప‌డ‌క‌ల‌తో ప్రాంతాల వారీగా ఆస్ప‌త్రుల‌ను సిద్ధం చేస్తున్నారు. భారత ఆరోగ్య పరిశోధన మండలి (ICMR) పాజిటివ్ వివరాలను ప్రకటించింది. మొత్తం 20 వేల మందికి పైగా అనుమానితుల నుంచి నమూనాలను సేకరించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు న‌మ‌దవుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ బారిన పడుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో క్రమక్రమంగా కేసులు అధికమౌతున్నాయి. శుక్ర‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 14 కేసులు న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం. 

 

భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ వ్యాప్తి అధిక‌మైతే మాత్రం ఊహించ‌ని ప‌రిణామాలు ఉంటాయ‌ని ప్ర‌భుత్వాలు ఆందోళ‌న చెందుతున్నాయి. ఇక‌ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లు విధిగా పాటిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఎంతో ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నాయి. ప‌రిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ నుంచి ప్ర‌త్యేక బ‌ల‌గాలు ఆయా రాష్ట్రాల‌కు చేరుకుంటున్నాయి.  ప్రజలు బయటకు రాకుండా..ఇళ్లల్లోనే గడుపుతున్నారు. వ్యాపారస్థులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: