మనం తీసుకునే ఆహరంపైనే మన ఆరోగ్య వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం అనారోగ్యం పాలవుతామో అప్పుడు  క్రమ ఆహరపద్దతిని తప్పినట్టేనని అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనిషి అనారోగ్యం పాలయ్యాడు అంటే గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రోగ నిరోధక శక్తి తగ్గుతోందని. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని మనిషి ఎదుర్కోవాలి అంటే రోగనిరోధకశక్తిని అత్యధికంగా కలిగి ఉండాలి..కానీ మనలో..కాదు కాదు ప్రపంచ వ్యాప్తంగా  రోగనిరోధకశక్తిని చాలామందిలో అత్యల్పంగా ఉంటోంది...అందుకే మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది..మరి ఈ రోగ నిరోధక శక్తి ప్రతీ ఒక్కరూ కలిగి ఉండాలంటే ఏమి చేయాలి..ఎలాంటి సహసిద్దమైన పద్దతులని పాటించాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

IHG

రోగనిరోధకశక్తిని పెంచుకోవాలంటే ముఖ్యంగా చేయాల్సిన మొట్టమొదటి పని ఫాస్ట్ ఫుడ్స్ ని దూరం పెట్టాలి. వేయించిన పదార్ధాలు, నూనె ఎక్కువగా పట్టించిన తినడం మానేయాలి. శరీరానికి అవసరమైన పోషకాలని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్ అత్యధికంగా ఉండే పదార్ధాలు మీ రోజు వారి ఫుడ్ మెనూ లో ఉండేలా చూసుకుంటే చాలు. మీరు తినే ఆహరం ప్రోటీన్ల తో ఉంటే మీ శరీరం అంతగా వైరస్ లతో యుద్ధం చేయగలదు..

 

రోగ నిరోధకశక్తిని పెంచే ఆహార పదార్ధాలు

 

  1. వెల్లుల్లి : శరీరానికి శక్తిని ఇవ్వడానికి , మరియు వైరస్ లతో శరీరం యుద్ధం చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడేది వెల్లుల్లి. వెల్లుల్లిలో రోగ నిరోధకశక్తిని పెంచే గుణాలు అత్యధికంగా ఉన్నాయి. దీనిలో ఉండే మినరల్స్ బ్యాక్టీరియా ఫంగస్ ఇన్ఫెక్షన్ లపై పోరాటం చేస్తుంది. అందుకే వెల్లుల్లి ని మీరు రోజు తీసుకోవడం ఎంతో ఉత్తమం.

IHG

  1. నిమ్మకాయ : నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరాన్ని ఎంతో ఉత్తేజంగా ఉంచడానికి, శరీరానికి తెలియని శక్తిని ఇవ్వడంలో కీలక పాత్రం పోషిస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచడంలో నిమ్మకాయకి ఉన్న గుణం మరే ఫలానికి లేదనే చెప్పాలి.

IHG

  1. క్యారెట్ : క్యారెట్ సైతం ఆరోగ్యానికి ఎంతో మంచిది రోగ నిరోధకశక్తిని పెంచడం లో కూడా క్యారెట్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే రోజు వారి క్యారెట్ తీసుకోవడం వలన క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ , విటమిన్ బి6 యాంటీ ఆక్సిడెంట్ లని ఉతేజపరుస్తాయి.

IHG

  1. అవెస గింజలు : ఇవి అద్భుతమైన మానవ శరీరాన్ని కాపాడుతాయి. ఇందులో ఉండే యాంటీ ఇంఫ్లమెంటరీ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి పూర్తి స్థాయి రక్షణని ఇస్తాయి. కొవ్వుని కరిగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే పుట్ట గొడుగులు కూడా రోగ నిరోధకశక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగ పడుతాయి. కివీ, నారింజ , పిస్తా, నల్ల ద్రాక్ష ఇవి కూడా రోగ నిరోధకశక్తిని ని పెంచుతాయి.

IHG

ఇవన్నీ రోజు వారీ చేస్తూనే అందరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. అదేమిటంటే పార్టీ రోజు ఉదయం ఎండలో 20 నిమిషాలు, సాయంత్రం ఎండలో 20 నిమిషాలు ఉండండి. ఇలా ఉండే సమయంలో మీరు ధ్యానం యోగా ద్వారా చేసినా పర్వాలేదు. ఆ తరువాత శరీరంలో B12 స్థాయి, D విటమిన్ స్థాయిలు సమపాళ్ళలో ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ మూడు మీరు పాటిస్తే తప్పకుండా మీ శరీరాన్ని కారోనా లాంటి వైరస్ లు ఎన్ని వచ్చినా కాపాడుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: