పుచ్చ‌కాయ‌.. స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే చాలు.. ఎక్క‌డిక‌క్క‌డ ఇవి ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఫుల్ వాట‌ర్ కంటెంట్‌తో నిండిన ఈ పుచ్చ టేస్ట్ ఎంతో బాగుంటుంది. ఇక పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే అయినా.. పుచ్చ‌కాయ గురించి ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని నిజాలు చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. బరువు తగ్గాలి అనుకునే వారు పుచ్చకాయ డైట్ ను చేయవచ్చు. 

 

ఈ వేసవి అన్ని రోజులు పుచ్చకాయ సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి, అన్నం తగ్గించి పుచ్చకాయను తినటం వలన బరువు తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే జీర్ణ వ్యవస్థకు, మూత్రపిండాల వ్యాధినివారణకు, కడుపునొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఎప్పుడైనా ఎండలో బయటకు వెళ్లినప్పుడు పుచ్చకాయ ముక్కలు తింటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. మ‌రియు మగవారిలో వీర్య వృద్ధికి ఉపయోగపడుతుంది. ఇక పుచ్చ‌కాయ గురించి మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే..  ప్రతి సంవత్సరం ఆగష్టు 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవంగా జరుపుకుంటారు. 

 

అవును మీరు విన్న‌ది నిజ‌మే. స్పెషల్ గా అమెరికాలో ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఈ స్పెషల్ డేని ఎవరు కనిపెట్టారో ఇప్పటికీ తెలియదు. కొందరు దీనిని పుచ్చకాయ రైతులు ప్రారంభించారని, మరికొందరు నేషనల్ వాటర్ మెలన్ కౌన్సిల్ సృష్టించినట్లు చెబుతారు. ఇక పుచ్చకాయలలో వ్యాధినిరోధక శక్తిని పెంచే బీటా కెరొటిన్, విటమిన్ బి, సి, లతో పాటు శరీర పనితీరుకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాసియం, అయోడిన్‌లు ఎక్కువగా ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: