తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ట్లుగా  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అనారోగ్యం బారిన పడిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు.  మృతుడికి ట్రావెల్ హిస్టరీ ఉండ‌టంతో  భౌతిక‌కాయం నుంచి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు టెస్ట్ కోసం పంపగా  కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. 74 ఏళ్లు ఉన్న ఈ వృద్ధుడు నాంపల్లికి చెందిన వాడ‌ని తెలిపారు.  చికిత్స పొందుతున్న మిగ‌తా వారిలోనూ కొంత‌మంది ప‌రిస్థితి ఆందోళ‌న క‌రంగానే ఉన్న‌ట్లు తెలిపారు. 

 

ఎవరికైతే బీపీ, షుగర్‌, కిడ్ని పేషంట్లు ఉన్నారో వారి ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బంది కరంగా ఉందని  వెల్లడించారు. ఓల్డ్‌ సిటీలో కరోనా సోకిన ఓ వ్యక్తి  మరో  6 మందికి కరోనా అంటించినట్లు  స‌మాచారం అందుతోంద‌ని అన్నారు. అలాగే ఒక డాక్టర్‌ ఇంట్లో నలుగురికి కరోనా సోకగా,  విమానాశ్రయంలో పనిచేస్తున్న మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. పాత బస్తీలో ఒకే కుటుంబానికి చెందిన మరో ఐదుగురికి కోవిడ్ సోకిందని ఈటల తెలిపారు. చనిపోయిన వ్యక్తి, ఈ ఐదుగురితో కలిపితే.. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 65కు చేరిందన్నారు.ఢిల్లీ వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకిందన్న ఈటల.. ఆయన వల్ల మరో 8-9 మందికి కోవిడ్ సోకిందని తెలిపారు.

 

అయితే ప్ర‌జ‌లెవ‌రూ కూడా ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రార్థన మందిరాలు, చర్చిలు, దేవాలయాలు కరోనా వ్యాప్తికి దోహదం చేయొద్దని సూచించారు. కరోనా వైరస్ గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని,  సోష‌ల్ మీడియా కూడా బాధ్యాతాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్నాం మ‌నం.. మ‌రింత చిక్కుల్లోకి మ‌న‌ల్నిమ‌నం లాక్కోవ‌ద్దంటూ హిత‌వు ప‌లికారు. ప్రైమ‌రీ కాంటాక్టుల సంఖ్య పెర‌గ‌డంపై ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ‌చ్చే వారం రోజుల్లో క‌రోనా ఉధృతి తెలిసిపోతుంద‌ని తెలిపారు. మంత్రి వ్యాఖ్య‌ల‌తో తెలంగాణ‌లో క‌రోనా దూకుడుకు బ్రేకులు వేయ‌లేరా అంటూ నెటిజ‌న్లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: