ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల‌ను  ఏ మేర‌కు వ‌ణికిస్తోందో మ‌న‌కంద‌రికీ తెలిసిందే.. ఈ వ్యాధి కార‌ణంగా ప్ర‌తి రోజూ ఆయా దేశాల్లో కొన్ని వంద‌ల మంది మ‌ర‌ణిస్తున్నారు. ద‌గ్గు, జ‌లుబు, సాధార‌ణ జ్వ‌రం, గుండెలో మంట ఈ వైర‌స్ యొక్క ప్ర‌ధాన ల‌క్ష‌ణాల‌ని చెబుతుండ‌టంతో  ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి స‌మ‌యాల్లో మ‌నం ద‌వాఖాన‌ల్లో దొరికే మందుల‌పైనే ఆధార‌ప‌డ‌కుండా..  మ‌న ఇంట్లో త‌యారు చేసుకునే ఔష‌ధాల‌తో కూడా రోగ నిరోధ‌క‌శ‌క్తిని పెంచుకోవ‌చ్చ‌ని  వైద్యులు పేర్కొంటున్నారు. అలాంటి ఒక చిట్కాను మ‌నం ఇవాళ వంటిట్లోనే త‌యారు చేసుకుందాం. 

 

ఒక బౌల్ తీసుకుని, అందులో ఒక‌టిన్న‌ర గ్లాస్ నీటిని తీసుకోవాలి. అదే రోజు మొత్తానికి త‌యారు చేసుకోవాల‌నుకుంటే .. ఒక రెండు గ్లాస్‌ల నీటిని తీసుకోవాలి. చిన్న అల్లం ముక్క‌ను తీసుకుని, బాగా శుభ్రం చేసుకోవాలి. ముందుగా దానిపై ఉన్న పొట్టును తీసేసి, చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. త‌ర్వాత రోట్లో గానీ, మిక్సీలో గాని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అల్లంలో విట‌మిన్ సీ, మెగ్నీషియంతో పాటు అనేక ర‌కాల మిన‌రల్స్ ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ద‌గ్గుతోగానీ,  గొంతులో నొప్పి, శ్వాస‌కోశ సంబంధ స‌మ‌స్య‌ల‌తో పాటు మంట‌ను త‌గ్గించ‌డానికి  అల్లం పురాత‌న ఆయుర్వేద ఔష‌దంగా పని చేస్తుంది. 

 

ముందుగా బౌల్‌లో నీటిని తీసుకుని స్టౌవ్ పై పెట్టుకోవాలి. నీరు మ‌రుగుతున్న‌ప్ప‌డే అందులో ఓ  బిర్యాని ఆకు, నాలుగు మిరియాలు, రెండు లేదా మూడు లవంగాలు, రెండు యాల‌కుల‌ను తీసుకుని, వీటిన్నింటినీ పొడిగా త‌యారు చేసి నీటిలో వేయాలి.  త‌ర్వాత నాలుగు తుల‌సి ఆకుల‌తోపాటు ఒక చెంచా వాము, ఒక చెంచా దాల్చిన చెక్క పొడి, ఒక చిన్న బెల్లం ముక్క‌, ఒక చెంచా న‌ల్ల ఉప్పును అందులో క‌లుపుకోవాలి. ఐదు నిమిషాలపాటు మ రిగిన ద్రావ‌ణంలో ఒక అర స్పూన్ ప‌సుపు వేసి ద్రావ‌ణం మొత్తం స‌గానికి వ‌చ్చే వ‌ర‌కు బాగా మ‌ర‌గించాలి.  ఆ తర్వాత స్టైవ్ ఆఫ్ చేసి ద్రావ‌ణాన్ని వ‌డ‌బోసుకోవాలి. ఈ ద్రావ‌ణాన్ని ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి వేళ‌ల్లో తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి  పెర‌గ‌డ‌మే గాక ద‌గ్గు, జ‌లుబు నుంచి  ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. వీట‌న్నింటినీ మ‌నం కేవ‌లం మ‌సాలా దినుసుల్లాగ‌నే ప‌రిగ‌ణిస్తాం.. కానీ వీట‌న్నింటిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లెమేట‌రీ ల‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయ‌ని వైద్యులు పేర్కొంటున్నారు. ఒంటిట్లో దొరికే దినుసుల‌తోనే అద్బుత‌మైన రెసిపీ త‌యారు చేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: