సాధారణంగా మనం అప్పుడప్పుడూ నిమ్మరసం ఉప్పు లేదా చక్కెర కలుపుకుని తాగుతూ ఉంటాం. నిమ్మరసం తాగితే మన శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. నిమ్మలో అనేక సహజసిద్ధమైన ఔషధ గుణాలు ఉంటాయి. చల్ల నీళ్లలో కంటే వేడి నీళ్లలో నిమ్మకాయను పిండి ఆ రసం తాగితే ఎంతో మంచిది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో నిమ్మరసం ఎంతగానో సహాయపడుతుంది.

 

షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు నిమ్మరసం తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. శరీరానికి రోగ నిరోధక శక్తి పెంచడంలో నిమ్మరసం సహాయపడుతుంది. నిమ్మరసం శరీరంలోని వ్యర్థాలను సులువుగా తొలగిస్తుంది. నిమ్మరసం రక్తహీనతను తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిమ్మరసం కిడ్నీలో ఉండే రాళ్లను కూడా కరిగిస్తుంది. 

 

నిమ్మరసం రోజూ తాగితే పలు రకాల క్యాన్సర్ల భారీన పడకుండా తప్పించుకోవచ్చు. రోజూ నిమ్మరసం తాగేవారికి గ్యాస్, ఆసిడిటీ, మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలు దూరమవుతాయి. నిమ్మరసం చర్మాన్ని మృధువుగా, కోమలంగా ఉంచడంతో పాటు ముడతలు, మచ్చలను పోగొడుతుంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులకు నిమ్మరసం సర్వరోగ నివారిణిగా పని చేస్తుంది. కానీ మోతాదుకు మించి మాత్రం నిమ్మరసం తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: