క‌రోనా వ్యాధి మ‌నుషుల ప్రాణాల‌నే కాదు...వారికున్న బంధాల‌ను ఆక‌స్మాత్తుగా తెచ్చేస్తోంది. అయిన వారికి కూడా క‌డ‌సారి చూపు ద‌క్క‌డం లేదు. ఇక ద‌హ‌న సంస్క‌రాలు కూడా చాలా ద‌య‌నీయంగా జ‌రుగుతున్నాయి. ఎవ‌రి మ‌తాల‌కు అనుగుణంగా కాకుండా అంద‌రికి ఒకే ప‌ద్ధ‌తిలో మెడిక‌ల్ ప్రొసిజ‌ర్స్‌లోనే సాగుతున్నాయి. ఇందులో ఎవ్వ‌రిని త‌ప్పుబ‌ట్ట‌లేం. అలా చేయ‌కుండా అపాయానికి సిద్ధ‌ప‌డాల్సిందే. అది ఎలాంటి భ‌యాన‌క ప‌రిస్థితుల‌కైనా దారితీయ‌వ‌చ్చు.భార‌త్‌లో  కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 32 మంది చ‌నిపోయారు. ఇంకా మ‌ర‌ణాల సంఖ్య భారీగానే ఉంటుంద‌ని తెలుస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతోంది.

 

 రెండు రోజుల్లోనే దాదాపు 350 పైచిలుకు కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే అమెరికా, స్పెయిన్‌, ఇట‌లీ వంటి దేశాల‌తో పొల్చుకుంటే మాత్రం భారత్‌లో ఇంకా వైర‌స్ నియంత్ర‌ణ‌లోనే ఉంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో 101మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 1117 మంది చికిత్స పొందుతున్నారు. కేరళ, మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనాతో మరణించే వాళ్ల సంఖ్య ఎక్కువవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడి చనిపోయిన వాళ్లను మతంతో సంబంధం లేకుండా దహనం చేస్తామని ప్రకటించింది.

 

 ఈ మేరకు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పరదేశీ కూడా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. అంత్యక్రియలకు ఐదుగురికి మించి హాజరు కావొద్దని తెలిపారు. ఎవరైనా శవాలను కచ్చితంగా పూడ్చి పెట్టాలని అనుకుంటే ముంబై పరిసర ప్రాంతాలు దాటి.. వేరే ప్రాంతంలో పూడ్చి పెట్టుకోవచ్చని  సూచించారు. కాగా, చైనాలో కరోనాతో మరణించిన వాళ్లను దహనం చేసిన సంగతి తెలిసిందే. పూడ్చి పెడితే వ్యాధి ప్రమాద స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందన్న కారణంతో ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్ర‌పంచంలోని చాలా దేశాలు అంత్య‌క్రియ‌ల్లో చైనానే ఆద‌ర్శంగా తీసుకుంటున్నాయి.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: