క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల్లో వేగంగా విస్త‌రిస్తోంది.  ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 38వేల మంది మృతి చెంద‌గా, సోమ‌వారం ఒక్క‌రోజే అమెరికాలో 20వేల కొత్త‌ కేసులు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం.  ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని వేలాది మంది పిట్టలా రాలిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా క‌రోనా బాధితుల సంఖ్య 7.85 లక్షలు దాటగా, గత 24 గంటల్లోనే వివిధ దేశాల్లో 3వేల మంది మృతిచెందారు. వైరస్ నిర్ధారణ అయినవారిలో 1,65,000 మంది కోలుకుంటే.. మరో 5.52 లక్షల మందిలో స్వల్పంగా లక్షణాలు ఉన్నాయి. అయితే, దాదాపు 30 వేల మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉన్న‌ట్లుగా డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌టించింది.  ఇదిలా ఉండ‌గా కరోనా వైరస్ ప్రభావం ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఎక్కువ‌గా ఉంది.

 

 మొత్తం కరోనా వైరస్ మరణాల్లో 70 శాతం ఐరోపా దేశాల్లోనే  ఉండ‌టం అక్క‌డి తీవ్ర ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది.  వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు  ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినా మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలో దీని వ్యాప్తి రోజుకు సగటున 500గా నమోదయ్యింది. తొలి లక్ష కేసుల న‌మోదుకు 67 రోజుల స‌మ‌యం ప‌డితే, రెండో లక్షను కేవలం 11 రోజుల్లోనే చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. తర్వాత లక్ష వారం రోజుల్లోనూ, ప్రస్తుతం రోజుకు సగటున 66వేల మంది వైరస్ బారినపడుతున్నారు. ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 37వేలు దాటింది. 

 

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఆ దేశంలోనే నమోదవుతున్నాయి. సోమవారం ఒక్క రోజే 20వేలకుపైగా కేసులు నమోదుకావడం గమనార్హం. ప్రస్తుతం ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1.64 లక్షలు దాటింది. అమెరికాలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న న్యూయార్క్, న్యూ జెర్సీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకి రావాలంటేనే జంకుతున్నారు. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో దాదాపు 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇట‌లీలో ఇటలీలో ప్రాణ నష్టం ఊహకు కూడ అంద‌డం లేదు. ఈ దేశంలో 11,500 మంది చ‌నిపోయారు. సోమవారం మరో 850 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌తో ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించలేదు. సోమవారం మాత్రం కొత్త కేసుల నమోదులో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. 4000 మందిలో వైరస్ నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 101,739కి చేరింది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: