ఆ పెద్దాయ‌న‌కు 93...ఆ అమ్మ‌కు 88 కొద్దిరోజుల క్రితం క‌రోనా బారిన ప‌డ్డారు. కుటుంబ‌స‌భ్యులు, బంధువులంతా ఇక ఇద్ద‌రి వృద్ధుల ప‌ని అయిపోయింద‌ని భావించారు. తీవ్ర  అనారోగ్యానికి గుర‌య్యారు..అయితే అనుహ్యంగా క‌రోనా కోర‌ల్లోంచి బ‌య‌ట ప‌డి ఇంటికి చేరుకున్నారు. ఈ సంఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రంలో జ‌ర‌గింది. దేశ వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తున్న వేళ కొంత‌మంది కోలుకుని ఇళ్ల‌కు చేరుకుంటున్నారు. అలా 138 మంది వ‌ర‌కు ఉన్నారు. క‌రోనా మహమ్మారిని జయించిన వారిలో కేరళకు చెందిన 93 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్య (88) కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కే కే శైలజ వెల్లడించారు. 

 

బాధితులు ఇద్దరికీ డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, ఇతర వయోభార సమస్యలున్న‌ప్ప‌టి క‌రోనాపై విజ‌యం సాధించ‌డం గొప్ప విష‌యం అన్నారు. కేరళలోని పథనంతిట్టా జిల్లా రాన్ని ప్రాంతానికి చెందిన థామస్ (93), మరియమ్ (88)ల కుమారుడు, కోడలు, వారి పిల్లలు ఫిబ్రవరి 29న ఇటలీ నుంచి తిరిగొచ్చారు. అయితే అప్ప‌టికే వారు వైరస్‌ బారినపడి ఉండ‌టంతో  ఈ వృద్ధ దంప‌తుల‌కు కూడా వ్యాప్తి చెందింది.  వీరికి వైరస్ సోకినట్టు మార్చి 8న నిర్ధారణ అయ్యింది. థామస్ దంపతుల కుటుంబంలోని మొత్తం ఏడుగురు స‌భ్యుల‌కు క‌రోనా ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. దీంతో వెంటనే వారందరినీ కొట్టాయం మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు.  గుండె సంబంధిత సమస్యలు ఉండడంతో తొలుత థామస్ దంపతుల ఆరోగ్యం బాగా క్షీణించింది. 

 

చికిత్స సమయంలో థామస్‌కు గుండె నొప్పి రావడంతో ఐసీయూలోని వీఐపీ గదికి మార్చారు. క్ర‌మంగా కోలుకున్న వృద్ధ దంప‌తుల‌కు నాలుగు రోజుల కిందట నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చింది. వీరితోపాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా వైరస్‌ నుంచి బయటపడ్డార‌ని  కేర‌ళ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కరోనా వైరస్ ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతోందని, కోవిడ్-19 మరణాల్లో వీరివే ఎక్కువ శాతం ఉందని గణాంకాలు చెబుతున్న వేళ ఈ వృద్ధ దంప‌తులు కరోనా నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం విశేష‌మేన‌ని వైద్యులు వెల్ల‌డిస్తున్నారు.  కేరళలో సోమవారం కొత్తగా మరో 32 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కరోనా బారినపడ్డవారి సంఖ్య 234కు చేరింది. వీరిలో ఇద్దరు మరణించగా.. 19 మంది కోలుకున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: