క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. దీనికి మందు లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ మొత్తం క‌మ్మేసి.. అనేక మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటుంది. ఇక వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు,సూచనలు చేస్తున్నాయి. అయితే ఈ వైరస్ బారినపడుకుండా ఉండాలంటే ఏకైక మార్గం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే.

 

రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్లనే ఈ వైరస్ బారినపడినవారు తిరిగి కోలుకుంటున్నట్టు నిపుణులు కూడా చెబుతున్నారు. ఇక విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే.. శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి అందుతుంది. మ‌రి రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాలంటే ఏ ఏ ఆహారం తీసుకోవాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి, ఆరెంజ్ తదితర పండ్లను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే విటమిన్ సి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

 

దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాసకోశ వ్యాధులను రాకుండా చూస్తుంది. అలాగే ఉసిరి కాయల్లోనూ విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయలు తిన్నా, వాటి రసం తాగినా బాడీలో చెడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి రావు. ఆకు పచ్చని కూరగాయలు తీసుకోవడం వల్ల కరోనాపై సగం విజయం సాధించవచ్చని వైద్యుల సూచిస్తున్నారు. మ‌రియు చెర్రీస్, కివి ఫ్రూట్, అర‌టిపండు ఇలాంటి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: