పొడవాటి గోళ్ళని   ఆడవారు ఎక్కువగా పెంచుతారు నైల్ పాలిష్ చేస్తూ ఎంతో అందంగా ఉంచుతారు. వారి చేతుల అందానికి అవి కూడా ఓ కారణమే. మగవారి సైతం గోళ్ళు  పొడుగ్గా పెంచుతారు కూడా. అయితే ఈ పొడవాటి గోళ్ళు  ఇప్పుడు వారి పాలిట శాపంగా మారనున్నాయట. తాజాగా వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే. కరోనా వ్యాప్తికి మనం చేతులని ఎలా శుభ్రం చేసుకున్నా పొడవాటి గోర్లు ఉన్న వారు అంతకంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలట...అదెలాగో ఇప్పుడు చూద్దాం..

IHG

తాజాగా ఆస్ట్రేలియా కి చెందిన ఓ ప్రఖ్యాత వైద్య నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం. పొడవాటి గోళ్ళు ఉన్నవారికి కరోనా వైరస్ తొందరగా వ్యాప్తించే ప్రమాదం ఉందట. కేవలం కరోనా మాత్రమే కాదు వివిధ రకాల వ్యాధులు సైతం ఈ గోళ్ళ ద్వారానే వ్యాప్తి చెందుతాయట. కరోనా కారణంగా చేతులు శుభ్రంగా 1 నిమిషం పాటు కడుక్కుని ఆ తరువాత కరోనా వైరస్ చేతుల ద్వారా మనకి రాదనీ ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ గోళ్ళు పొడుగ్గా ఉన్న వారు 1 నిమిషం కాదు కదా ఒక గంట శుభ్రం చేసుకున్నా వారి చేతులకి కరోనా ఉంటే యిట్టె సోకుంతుందట..ఈ విషయాన్ని ఎవరూ గమనించ లేదని నిపుణులు అంటున్నారు.

IHG

పొడవాటి గోళ్ళు ఉన్న వారిలో ఈ వైరస్ గోళ్ళ లోపల స్థిరంగా ఉంటుంది. మనం ఎంతగా ఈ వైరస్ ని పోగొట్టాలని చూసినా అది గోళ్ళ సందుల్లో ఇరుక్కుని పోతుంది. ఈ క్రమంలోనే మనలో చాలా మందికి సహజంగా గోళ్ళు కోరికే అలవాటు ఉండటంతో నోటి ద్వారా ఈ వైరస్ లోపలి వెళ్తుంది. అలాగే గోళ్ళ సందుల్లో ఉన్న వైరస్ మనం అన్నం తినే సమయంలో అన్నంతో కలిసి లోపలి వెళ్తుంది. ఈ పరిస్థితి నుంచీ బయట పడాలంటే..తప్పకుండా గోళ్ళని చిన్నవిగా కత్తిరించుకోవాలని తెలిపారు. అయితే

IHG

వేలి గోళ్ళ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ పోవాలంటే ఈ చిట్కాలని పాటించితే సరిపోతుంది. వేలి గోళ్ళని ఎప్పటికప్పుడు కత్తిరించి చిన్నవిగా ఉంచుకోండి. గోళ్ళని శుభ్రం చేసుకోవడానికి బ్రష్ ఉంటే వాటితో శుభ్రం చేసుకోండి. గోళ్ళని కొరకడం మానుకోండి, నిమ్మకాయ లో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి కాబట్టి గోళ్ళని క్లీన్ చేసేటప్పుడు నిమ్మకాయ చెక్కతో శుభ్రం చేసుకోండి ఎలాంటి వైరస్ లు అయినా క్షణాలలో మాయమయ్యిపోతాయి. కరోనా వైరస్ నుంచీ మిమ్మల్ని మీరు రక్షించుకొవడంలో ఇదొక ప్రధానమైన అంశం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: