క‌రోనాతో చ‌నిపోయిన వ్య‌క్తి మృత‌దేహాన్ని పూడ్చిపెట్ట‌డంపై హైద‌రాబాద్‌లో పెద్ద ఆందోళ‌న జ‌రుగుతోంది.  కరోనాతో మృత్యువాతపడిన పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తిని చాదర్‌ఘాట్‌ పరిధిలోని కాంగా నగర్‌లో శ్మశాన వాటికలో మంగళవారం (మార్చి 31) ఖననం చేశారు. దీనిపై స్థానికులు ఆందోళన చేశారు. వాస్త‌వానికి పూడ్చి పెట్ట‌డం వ‌ల్ల వైర‌స్ వ్యాప్తి మ‌రింత ఎక్క‌వ‌య్యే ప్ర‌మాద‌ముంద‌ని కొంత‌మంది వాదిస్తున్నారు. అయితే భూమ్మిద ప‌డ‌గానే వైర‌స్ చ‌నిపోతుంద‌ని వైద్యుల్లో కొంత‌మంది తేల్చిచెబుతున్నారు. అయితే వైర‌స్ క‌నుగొన్న చైనాలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు కూడా క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించిన వారి దేహ‌ల‌ను ద‌హ‌నం చేస్తూ వ‌స్తోంది. 

 

అయితే ఇది భార‌త్‌లోని కొన్ని మతాల్లోని అంత్య‌క్రియల‌కు ఇది విరుద్ధం. పూడ్చిపెట్ట‌డం చేస్తూ ఉంటారు.  నిబంధనలు ఏం చెబుతున్నాయి? కోవిడ్19 కారణంగా మరణించిన వ్యక్తులను నిబంధనల ప్రకారం దహనం చేయాలి. వారు ఏ మతానికి చెందిన వారైనా ఇదే పద్ధతి పాటించాలి. అంత్యక్రియల్లోనూ ఐదుగురి కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదని ఆదేశాలున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికే ఈ నిబంధనలు విధించారు.  చాదర్‌ఘాట్ విష‌యానికి వ‌స్తే కరోనాతో మరణించిన వ్యక్తుల మృతదేహాన్ని దహనం చేయాల‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా ఎందుకు పూడ్చిపెట్టారంటూ స్థానికులు ఆందోళ‌న‌కు దిగారు. 

 

పోలీసులు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోలేదని మండిప‌డుతున్నారు. వైరస్ నిరోధక ద్రావణాన్ని కూడా స్ప్రే చేయకుండా ఎలా ఖననం చేస్తారంటూ ఎస్ఐ కరణ్ కుమార్‌ను నిలదీశారు. కాచిగూడ పోలీసులు వచ్చి స్థానికులకు నచ్చజెప్పిన ప్ర‌జ‌ల్లో మాత్రం భ‌యాందోళ‌న నెల‌కొంది. విష‌యాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు మృత‌దేహాన్ని ద‌హ‌నం చేయించేలా స‌న్నద్ధం అవుతున్నారు. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తామ‌ని చెబుతున్నారు. అయినా చ‌ట్టంలో ఉన్న‌ట్లుగా నిబంధ‌న‌ల‌ను పోలీసులు అతిక్ర‌మించ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: