కరోనా వైరస్ అంటేనే జనాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి.  క‌రోనా వైర‌స్ త‌న ప్రియురాలి నుంచి త‌న‌కు సోకింద‌ని భావించిన ఓ యువ‌కుడు ఆమెను దారుణంగా చంపేశాడు.ఈ సంఘ‌ట‌న ఇట‌లీలో జ‌రిగింది. సిసిలీకి చెందిన లారెనా క్వారెంటా, అంటోనియా డి పేస్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లారెనా వృత్తిరీత్య‌ డాక్టర్. ఆంటోనియా  మేల్ నర్సుగా పనిచేస్తున్నాడు.  ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలందిస్తుండేవారు. అయితే ఇట‌లీలో కొన్నిరోజులుగా క‌రోనా విరుచుకుప‌డుతుండ‌టంతో ఆ దేశం అత‌లాకుత‌లం అవుతోంది. ఈ క్ర‌మంలో వైద్య‌వృత్తిలో ఉన్న ఇద్ద‌రూ కూడా త‌మ శాయ‌శ‌క్తులా సేవ‌లందించారు.  ఈ క్ర‌మంలో ఇద్ద‌రు ఒక‌రినొక‌రు ప్రొత్స‌హించుకునేవారు. 

 

గ‌త‌వారం ప్రియురాలిని పొగుడుతూ త‌న స్నేహితుల‌కు ఆంటోనియా సందేశాలు కూడా పంపించాడు. అయితే ఈ సంఘ‌ట‌న త‌ర్వాత ఆంటోనియా స్వ‌ల్పంగా అనారోగ్యానికి గుర‌య్యాడు. ఇంచుమిం చు కరోనా లక్షణాలే కనిపించడంతో.. లారెన్ కార‌ణంగానే త‌న‌కు క‌రోనా సోకింద‌ని బ‌లంగా విశ్వ‌సించాడు. ఆ అనుమానంతో  బుధ‌వారం ఇంటిలో నిద్రిస్తున్న లారెన్‌ను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆంటోనియా కూడా మణికట్టు కోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. అయితే  త‌న ప్రియురాలిని చంపేశాన‌ని, తాను చావు బ‌తుకుల మ‌ధ్య ఉన్న‌ట్లు  పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 

 

బాగా రక్తం పోవడంతో అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా  లారెన్, ఆంటోనియాల ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యుల‌కు షాకింగ్ నిజాలు తెలిసాయి. అస‌లు ఇద్ద‌రిలో ఎవ‌రికీ క‌రోనా పాజిటివ్ లేద‌ని తేలింద‌ని తెలిపారు. చేయ‌ని పాపానికి ప్రియురాలిని పొట్ట‌న పెట్టుకున్నానా అంటూ ప్రియుడు ఆంటోనియా పశ్చాతాపడుతూ పోలీసుల ఎదుటే రోధించాడు.ఈ సంఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇట‌లీలో దారుణ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో శ‌వాల కుప్ప‌లుగా ప‌డి ఉంటున్నాయి. ద‌హ‌న సంస్కరాలు కూడా చేసే వారు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే అక్క‌డి ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని ప్ర‌పంచ దేశాల‌ను వేడుకుంటోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: