భారత మార్కెట్ లో విరివిగా దొరికే పండ్లలో కివి పండు ఒకటి. ఈ పండును చాలా మంది వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండులో నిమ్మ, ఆరెంజ్ తో పోలిస్తే సి విటమిన్ అధికంగా ఉంటుంది. మన దేశంలో ఈ పండ్లు పండవు. కివి పండు చూడటానికి చిన్నగా కనిపించినా ఈ పండ్ల వల్ల అనేక ప్రయోజనాలు చేకూరటంతో పాటు పండు ఎంతో రుచిగా ఉంటుంది.

 

ఈ పండుతో రకరకాల మిల్క్ షేక్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ పండు గుజ్జును ఫేస్ మాస్క్ మాదిరిగా ఉపయోగించవచ్చు. ఈ పండు గుజ్జును షాంపూలా ఉపయోగిస్తే జుట్టు సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. రోజూ ఈ పండును ఆహారంలో భాగంగా తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా దూరమవుతాయి. ఈ పండు రక్త పోటును నియంత్రించటంతో పాటు గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

 

జీర్ణశక్తిని పెంచడంతో పాటు శరీరంలోని అనవసరపు టాక్సిన్లను బయటకు పంపించడంలో కివి సహాయపడుతుంది. ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగితే ఈ పండు తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పండులో ఉండే గ్లైసెమిక్ ఇండ్లెజ్ షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గడానికి ఈ పండు ఎంతో సహాయపడుతుంది. ఈ పండు రోజూ తింటే చర్మ సంబంధిత సమస్యలన్నీ దూర్మవుతాయి. ఇందులో ఉండే మినరల్స్ యాసిడ్ లెవెల్స్ సరిగ్గా ఉండేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: