ఆరోగ్యంగా ఉండాల‌ని ఎవ‌రు కోరుకోరు చెప్పండి. ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అయితే మ‌న ఆరోగ్యం మ‌న చేతుల్లోనే ఉంటుంది. మ‌న జీవిన‌శైలి, మ‌న ఆహార అల‌వాట్లు ఇత‌రిత‌ర వాటిపై ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. వేడి నీటి స్నానం మంచిదా.. చ‌న్నీటి స్నానం మంచిదా.. అన్న‌ది చాలా మందికి ఉన్న సందేహం. అయితే వాస్త‌వానికి రెండూ మంచివే. ఎందుకంటే చ‌న్నీటి స్నానం వ‌ల్ల కొన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందితే.. వేడి నీటి స్నానం వ‌ల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

 

వేడినీరు మీ బాహ్యచర్మాన్నే కాకుండా చర్మం లోపలి పొరలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. మీ చర్మం యొక్క రంధ్రాలను తెరవడానికి మరియు మృతకణాలను, దుమ్ము మరియు చర్మానికి హాని కలిగించే విషతుల్య మలినాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఇక తాజాగా తేలిన మ‌రో విష‌యం ఏంటంటే.. హృద్రోగాలు, పక్షవాతం దరిచేరకుండా ఉండేందుకు ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటాం. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటాం. అయితే, చాలా సులువైన చిట్కాతో హృద్రోగాల ముప్పును 28 శాతం తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

ప్రతి రోజు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల గుండె జబ్బులతో పాటు పక్షవాతం బారిన పడే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని తేల్చారు. వేడినీటిలో స్నానం చేయడం మీ శరీర రక్తనాళాలకు వ్యాయామం వలె ఉంటుంది. గుండెకు సరైన రక్త ప్రసరణ అందివ్వడంలో సహాయం చేయగలదు. ఇక మధుమేహంతో బాధపడుతున్న రోగులు క్రమం తప్పకుండా వేడినీటితో స్నానం చేయడం మూలంగా 2.5 పౌండ్ల బరువును కోల్పోతారని అధ్యయనాలలో తేలింది. వేడినీటి స్నానం రక్తంలోని గ్లూకోజ్ మరియు చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

 
   

మరింత సమాచారం తెలుసుకోండి: