ప‌చ్చి మిర్చి లేనిదే వంట పూర్తి కావ‌డం చాలా క‌ష్టం అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే సాధారణంగా ప‌చ్చి మిర్చి అంటే చాలామంది తెగ భయపడిపోతారు. కారంగా ఉంటుంది. తినలేమంటూ వంటలో వాడినా పక్కన పడేస్తుంటారు. కానీ, నిత్యం వంటల్లో వాడే ఘాటైన పచ్చిమిర్చితో లాభాలు అనేకం. వంటలకు రుచిని అందించడమే కాదు... ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడటంలోనూ ఇది ప్రధాన పాత్రే పోషిస్తుంది.  పచ్చిమిర్చి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లకీ, ప్రొటీన్లకీ పెట్టింది పేరు. 

 

అంతేనా అంటే కాదండోయ్‌.. ప‌చ్చి మిర్చితో అనేక లాభాలు ఉన్నాయి.  వీలైనంత వరకు ఎండుమిరప పొడిని తగ్గించి.. పచ్చి మిరపని వాడేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెపుతుంటారు. పచ్చి మిరపకాయకి ఎర్ర రక్తకణాలను వృద్ధి చేసే గుణం కూడా ఉంది. మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి. పచ్చిమిరప తినడం వల్ల శరీరంలోని అనసవర బ్యాక్టీరియా నాశనమవుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది.

 

అలాగే ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. మ‌రియు క్యాన్సర్ తో బాధపడేవారు రోజు పచ్చిమిర్చి ఆహారంతో కలిపి భుజిస్తే... వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు గుండె సంబంధిత వ్యాధులు దరిచేర వంటున్నారు. ఇక పచ్చిమిరపలో ఉండే విటమిన్‌-సీ కారణంగా విటమిన్లను శోషించుకునే గుణం శరీరానికి కూడా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: