కొన్ని మనం చాదస్తం అని అనుకుంటాం కానీ.. అవి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అది తెలియక మనం పెద్దల మాటలను లెక్క చెయ్యం. కానీ నిజం ఏంటి అంటే? పెద్దల మాట సద్దిమూట - పూర్వీకుల బాట అమృతధార ఊట అని. ఇది తెలియని మురుకులు కొందరు ముర్కులు ఆ మాటలను కొట్టి పడేస్తారు.. 

 

అయితే ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండటానికి ప్రస్తుతం శాస్త్రవేత్తలు సృష్టించిన మందుల కంటే పూర్వికులు చెప్పిన గృహ వైధ్యమే ఎంతో మంచిది. అయితే పూర్వికులు చెప్పిన మంచి చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. మందుల కంటే కూడా ఈ చిట్కాలు వాడి జలుబును తగ్గించేసుకోండి. 

 

ఒక కప్పు పాలలో ఒక స్పూన్ పసుపు పొడిని కలిపి, తీసుకుంటే ఉదయం లేచేసరికి జలుబు ఇట్టే తగ్గిపోతుంది.

 

ఒక గ్లాసు అనాసపండు రసంలో మిరియాలపొడి, ఉప్పు కలిపి తీసుకుంటే జలుబు ఈజీగా తగ్గిపోతుంది. 

 

తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు ఈజీగా తగ్గిపోతాయి.

 

మిరియాలపొడి, పెరుగును కలిపి తింటే జలుబు తగ్గిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: