ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు క‌రోనా ముప్పు రోజురోజుకు ఎక్కువ‌వుతోంది. చూస్తుండ‌గానే రోజుకో ప్రాణం గాలిలో క‌లిసిపోతోంది. తాజాగా మ‌రో ఇద్ద‌రిని క‌రోనా బ‌లిగొంది. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 194కు చేరింది. శనివారం ఉదయానికి 164 నమోదు కాగా.. రాత్రికి మరో 30 కేసులు పెరిగినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. అనధికారిక సమాచారం ప్రకారం.. అనంతపురం జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. స‌ద‌రు ఇద్ద‌రు కూడా క‌రోనాతో మృతిచెందిన‌ట్లు అధికారులు ధ్రువీక‌రిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరిన‌ట్ల‌వుతుంది.


 కొత్త‌గా న‌మోద‌వుతున్న పాజిటివ్ కేసుల్లో త‌బ్లీగి జ‌మాత్ ప్ర‌తినిధుల‌కు సంబంధించిన‌వి, వారి కుటుంబ స‌భ్యులే ఎక్కువ‌గా ఉంటుండ‌టం గ‌మ‌నార్హం. ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మార్చి 30న అతడు చనిపోయినా ఏప్రిల్ 3న వెలుగులోకి వచ్చింది. మృతుడు కుమారుడు నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చాడు. ఇదిలా ఉండగా ఏపీలో శనివారం మరో ఇద్దరు కరోనా వైరస్ బారినపడి మృతిచెందినట్టు సమాచారం.  శ‌నివారం రాత్రి వైద్య ఆరోగ్య‌శాఖ  హెల్త్‌బులిటెన్‌లో వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. కృష్ణా జిల్లాలో 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపూరం జిల్లాల్లో ఒక్కొక్క కేసు కొత్త‌గా నమోదైనట్లు పేర్కొంది.  


 కొత్తగా నమోదైన 10 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 190కి పెరిగినట్ల‌యింది.  ఇక గుంటూరు, కడప, కృష్ణా, నెల్లూరు.. నాలుగు జిల్లాల్లోనే 113 కరోనా కేసులు నమోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే కేసుల సంఖ్య రాత్రికి మరో నాలుగు పెరిగి 194కు చేరుకున్నా యి.రాష్ట్రంలో అత్యధికంగా నెల్లూరు, కృష్ణాలో 32 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 30, కడప 23, ప్రకాశం 21, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో 15 చొప్పున, తూర్పుగోదావరిలో 11, చిత్తూరు 10, కర్నూలు 4, అనంతపురంలో 3 కేసులు న‌మోదైన‌ట్లు అధికారులు ధ్రువీక‌రించారు.  ఇదిలా ఉండ‌గా శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్క కేసూ నమోదుకాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: