సాధార‌ణంగా పండ్లను తిని గింజలు పారేయడం ఎవరైనా చేస్తారు. కాని,  గింజలను తిన్న వాడే అసలుసిసలు ఆరోగ్యవంతుడు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే శరీరానికి అవసరమైన పోషణ వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఇక అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బొప్పాయి గింజ‌లు. బొప్పాయి గింజల్లో ఓలిక్, పాల్మిటిక్‌ యాసిడ్స్‌ అనే ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. శక్తిమంతమైన ఆ ఫ్యాటీయాసిడ్స్‌ క్యాన్సర్‌ను దూరంగా తరిమేస్తాయి. చైనా సంప్రదాయ మందుల్లో ఈ గింజల్ని కాలేయాన్ని శుద్ధి చేసే ఔషధంగా ఉపయోగిస్తారు. 


 
అయితే ఈ గింజలు కొద్దిగా చేదుగా ఉంటాయి. కానీ వీటిలో శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి మెండుగా ఉంటాయి. బొప్పాయి గింజలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే పరగడుపునే రెండు స్పూన్ల‌ బొప్పాయి గింజ‌లను రోజూ తింటుంటే మధుమేహం, హార్ట్ అటాక్ వంటి వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.  అదేవిధంగా, బొప్పాయి సీడ్స్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. 

 

అలాగే ఫుడ్ పాయిజనింగ్ అరికట్టడానికి కూడా ఇవి సహాయపడతాయి. అంతేకాదు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక రకాల ఇన్ ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. మ‌రియు ఇందులో ఉండే యాంటీ వైరల్ గుణాల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. డెంగ్యూ ఫీవర్ నివారించడానికి చాలా దేశాల్లో వీటిని వాడుతున్నారు. . అయితే బొప్పాయి గింజలు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఎక్కువ తీసుకోవడం వల్ల అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: