క‌రోనాతో స‌ర్వం లాక్‌డౌన్  కంటిన్యూ అవుతుండ‌గా ఇన్నాళ్లు మాన‌వుడి కాలుష్య‌ విష వ‌ల‌యంలో చిక్కుకున్నా  ప్ర‌కృతి ఇప్పుడు సేద‌తీరుతోంది. దాదాపు రెండు వారాలుగా దేశ‌మంతా జ‌న‌సంచారం లేక‌పోవ‌డంతో..స‌ర్వం స్తంభించిన విష‌యం తెలిసిందే. మాన‌వుడి క‌ద‌లిక‌లు..వాహ‌నాల నుంచి వెలువడే కాలుష్యం నిలిచ‌పోవ‌డంతో ప్ర‌కృతి అందాలు..మ‌హాత్యం ఒక్కోటి బ‌య‌ట‌ప‌డ‌తున్నాయి. యమునా నది నీరు కేవలం 12 రోజుల్లో స్వచ్ఛంగా మారిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు అందులో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. య‌మునా నీరు అంత స్వ‌చ్ఛంగా మారిపోయింద‌ని ప‌ర్యావ‌ణ ప్రేమికులు ఆనంద ప‌డుతున్నారు. 

 

వాస్త‌వానికి యమునా నదిని దేశంలోనే  అత్యంత మురికి నదిగా భావించేవారు. యమునా నది వంతెనపై నిలుచున్నప్పుడు అందులోని నీరు మురికిగా, తెల్లటి నురుగు రూపంలో కనిపిస్తుండేది ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు పేర్కొంటున్నారు. అయితే  ఇప్పుడు ఆ నీరు చాలా స్వచ్ఛంగా మారిపోయింద‌ని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. గతంలో యమునానది కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, యుపి కాలుష్య నియంత్రణ మండలి ఎంతగానో కృషి చేశాయి. అయితే పూర్తిస్థాయిలో వారి పోరాటం ఫ‌లించ‌లేదు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇప్పుడు పరిశ్రమల మూసివేత, రవాణా వ్యవస్థ నిలిచి పోవడంతో ఆ ప్రభావం యమునా నదిపై పడింది. ఫలితంగా యమునా స్వచ్ఛంగా మారిపోయింది.


భారత్‌లో లాక్‌డౌన్ ఎత్తివేయాల‌ని కొంత‌మంది నుంచి డిమాండ్ వినిపిస్తున్నా..అనేక మంది మాత్రం ఇప్ప‌ట్లో వ‌ద్ద‌న్నా వాయిస్‌నే వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.  వైద్యసౌకర్యాలు నామమాత్రంగానే ఉన్న భారత్‌లో కరోనా విజృంభిస్తే నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంద‌ని చెబుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి క‌ళ్లారా చూస్తూ కూడా త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో ప్ర‌మాదంలో ప‌డ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. ఆర్థిక ప‌రిస్థితులు కాస్త ఆల‌స్యంగానైనా చ‌క్క‌బ‌డ‌తాయ‌ని, లాక్‌డౌన్ ప‌రిమితిని ఎత్తివేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌ను అదుపు చేయ‌డం క‌ష్టం అవుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: