ప‌చ్చ‌ళ్లు.. అంటే ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. ఎన్ని కూరలున్నా ఘుమఘుమలాడే ఆవకాయ లేనిదే భోజనం చేసిన తృప్తి మిగలదు తన తెలుగువారికి. పేదవారైనా, ధనికులు అయినా పచ్చడి ముందు సమానమే అన్నట్లుగా అందరూ ఎంతో ఇష్టంగా పచ్చడితో అన్నం తింటారు. ఇక ఆవకాయకైనా సరైన సీజన్ వేసవే..అందుకే సమ్మర్‌లోనే సంవత్సరానికి సరిపడినంత పచ్చళ్లు తయారు చేసుకుని నిల్వ చేసుకుంటుంటారు. వీటిని సంవత్సరం మొత్తం తింటుంటారు. అయితే ప‌చ్చ‌ళ్లు తిన‌డం ఆరోగ్యానికి మంచిదా.. కాదా.. అన్న‌ది చాలా మందికి అవ‌గాహ‌న లేక‌పోవ‌చ్చు.

 

వాస్త‌వానికి పచ్చళ్లు అంటేనే నిల్వ పదార్థాలు. ఇవి ఎంతకాలమైనా.. రుచిగా ఉండటానికి.. నిల్వ ఉండటానికి ఇందులో నూనె ఎక్కువ వాడతారు. ప్యాక్ చేసిన పచ్చళ్లు పాడవకుండా ఉండటానికి నూనెతోపాటు ఉప్పు, వెనిగర్ ఎక్కువ మోతాదులో కలుపుతారు. అయితే ఇవి మితంగా తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. కానీ, ఎక్కువ‌గా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. నిత్యం ఊరగాయలు తీసుకునే వాళ్లు కాస్త జాగ్రత్త వహించాలి. 

 

ఎక్కువగా పచ్చళ్లు తినే వాళ్లలో ఉదరంలో నొప్పి పెరుగుతుంది. మ‌రియు పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. పచ్చళ్లలో ఉప్పు, నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అరగడానికి సమయం పట్టడమే కాకుండా, బీపీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో వాడేవన్ని ఆరోగ్యపరంగా మంచివే అయినా సరే.. వాటిని నిల్వ చేసి తింటున్నాం కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏదైనా మితంగా తింటేనే అందరికీ మంచిది..రుచిగా ఉంది కదా అని రోజు పచ్చళ్లు తింటే మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌వు.
 
  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: