భారతీయ సంప్రదాయంలో పూజగదిలో ఉండే వస్తువుల్లో కర్పూరం ఒకటి. కర్పూర హారతి అందుకుని భగవంతుణ్ని స్మరించుకోవడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఇది మైనంలా తెల్లగా వుండి ఒక ఘాటైన వాసన కలిగిన పదార్థం. అయితే కర్పూరంను పూజ‌కు మాత్ర‌మే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. జలుబు, దగ్గు, ముఖంపై మొటిమలు, కాళ్ల పగుళ్లకు కర్పూరం చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. మ‌రి దీన్ని ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ అంటువ్యాధుల చికిత్సలో కర్పూరంను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందొచ్చు. అందుకు నీటిలో కర్పూర గుళికలు వేసి కలపి ఇన్ఫెక్షన్ ఉన్న బాధిత ప్రాంతంలో నేరుగా రాసుకోవాలి. ఇది ఆరిన తర్వాత పాదాలను క‌డిగితే బ్యాక్టీరియల్ అంటువ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు కర్పూరంను ఉపయోగించడం వల్ల ముక్కుదిబ్బడను నివారిస్తుంది. చాతీలో, ముక్కులో అసౌకర్యాన్ని తొలగిస్తుంది. 

 

అందుకు ఒక చుక్క కర్పూరం నూనెను ఒక టీస్పూన్ బాదం నూనెతో మిక్స్ చేసి చాతీ మీద సున్నితంగా మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ ను అందిస్తుంది. ఇక మన ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉండేలా చేస్తుంది. అలాగే నీటిలో కర్పూరం బిళ్లలను వేసి మంచం కింద ఉంచితే దోమలు రాకుండా ఉంటాయి. అయితే కర్పూరం విషపూరితమైనది. పరిమితికి మించి వినియోగిస్తే ఆరోగ్యానికి ప్రమాదం జరగవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: