క‌రోనా క‌ట్ట‌డికి ప్రఖ్యాత న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  నిర్వహించిన ఓ అధ్యయనంలో కోవిడ్‌-19 వ్యాధి నియంత్ర‌ణ‌కు బీసీజీ వ్యాక్సిన్ ఉపయోగ పడుతుందని తేలిన‌ట్లు ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. క్షయవ్యాధి నుంచి రక్షించే ఈ వ్యాక్సిన్, కోట్లాది మంది భారతీయులకు తప్పనిసరిగా ఇచ్చే వ్యాక్సిన్స్ లో ఒకటిగా ఉంటోంది. గ‌తంలో భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక క్షయవ్యాధి కేసులు న‌మోద‌వుతుండ‌టంతో  ఇక్క‌డ  బీసీజీ వ్యాక్సిన్లను పుట్టిన పిల్లలకు తప్పని సరి చేశారు. ఫలితంగా దేశంలో క్షయవ్యాధితో మరణాల రేటు చాల నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చింది.  

అయితే కరోనా సైతం ఊపిరితిత్తులను శ్వాసకోశాలను బలహీన పరిచే వైరస్ కావడంతో బీసీజీ అయితే సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంద‌ని డాక్ట‌ర్లు పేర్కొంటున్నారు.. జీవితంలో ఏదో ఒక సమయంలో బిసిజి టీకాలు తీసుకున్న వారిలో ఇతరులకన్నా తక్కువగా మరణించే అవకాశం ఉందని నివేదిక సూచిస్తుండ‌టం గ‌మ‌నార్హం. పుట్టిన పిల్లలకు ఇచ్చే బిసిజి( బాసిల్లస్ కాల్మెట్-గురిన్ వ్యాక్సిన్) ప్రాణాంతక కరోనావైరస్ కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో "గేమ్-ఛేంజర్" కావచ్చని యుఎస్ఎ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఏ దేశంలో అయితే బిసిజి టీకాలను విరివిగా ఇచ్చారో ఆయా దేశాల్లో మరణాల రేటు మిలియన్‌కు 4.28 కాగా, బీసీజీ ఇవ్వని దేశాలలో మిలియన్‌కు 40 చొప్పున ఉందని అధ్యయనం నివేదిక తెలియ‌జేస్తోంది. 

 

క‌రోనా క‌ట్ట‌డి కోసం అధిక ప్రమాదం ఉన్న వారిపై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్  నిర్వ‌హించేందుకు శాస్త్ర‌వేత్త‌లు సన్నద్ధం అవుతున్నారు. ఆరోగ్య సంరక్షణ కార్మికులు మరియు వృద్ధులు, సీరియస్ కండిషన్ లో ఉన్నవారికి ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉంద‌ని స‌మాచారం. అయితే భార‌తీయ శాస్త్ర‌వేత్త‌ల వాద‌న మాత్రం భిన్నంగా ఉంది. ఈ టీకాపై ఆశలు పెట్టుకోవడం చాలా తొందర పాటు చ‌ర్య అవుతుంద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.  ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ‘పెద్ద ఎత్తున ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు’ నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: