క‌రోనాతో  బాధ‌ప‌డుతూ చ‌నిపోయిన వారిని ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌ల‌తో ఖ‌న‌నం చేయాల‌ని వినిపిస్తున్న భిన్న వాదాల నేప‌థ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెల్ల‌డించింది.  ఫ‌లితంగా కరోనా మృతదేహాల ఖననం కోసం ప్ర‌త్యేకంగా శ్మశానవాటికను కేటాయిస్తూ వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వల్ల మరణించిన వారిని ఖననం చేసేందుకు శ్మశానవాటికల్లో ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే మృతదేహాల ఖననం కోసం ప్రత్యేకంగా ఒక శ్మశానవాటికను కేటాయించాల‌ని ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేర‌కు  ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులోని మిలీనియం పార్కు వద్ద ఉన్న జదీద్ ఖబరస్థాన్ ను కొవిడ్ మృతదేహాల శ్మశానవాటికగా నామకరణం చేశారు.

 

 ఢిల్లీ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ఎం అలీ మాట్లాడుతూ అంత్య‌క్రియ‌ల్లో మ‌త‌ప‌ర‌మైన సంప్ర‌దాయాల‌ను, ప‌ద్ధ‌తుల‌ను కొన‌సాగించేందుకే ఈనిర్ణ‌యం తీస‌కున్న‌ట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లోనే 1,035 కరోనా కేసులు, 40 మరణాలు సంభవించిన నేపథ్యంలో కరోనా మృతుల ఖననం కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటికను కేటాయించడం విశేషం. ఇదిలా ఉండ‌గా దేశ వ్యాప్తంగా చూస్తే ఢిల్లీలోనే క‌రోనా మ‌ర‌ణాలు ఎక్కువ‌గా సంభ‌విస్తున్నాయి. అంతేకాక మ‌ర్క‌జ్ మూలాలున్న కేసులు కూడా ఢిల్లీలోనే అధికంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. కరోనా ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతుండ టంతో.. ఈ లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలంటూ.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. 


లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే.. పరిస్థితులు మళ్లీ మొదటి వచ్చే అవకాశం ఉందని ఎక్కువ‌మంది ముఖ్య‌మంత్రులు పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూనే  ‘‘లాక్‌డౌన్ కొనసాగించే నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటే.. అది కరోనాపై చేస్తున్న పోరాటానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అంతేకాక.. ఒకవేళ లాక్‌డౌన్‌ను సడలించినా.. రైలు లేదా రోడ్డు మార్గాల్లో ఎటువంటి రవాణాను అనుమతించకూడదు’’ అని కేజ్రీవాల్ ప్రధానికి సూచించ‌డం గ‌మ‌నార్హం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: