భార‌త్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్‌ విధించి నేటికి 21 రోజులు అవుతున్నా పాజిటివ్‌ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజూ వేల సంఖ్యల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్‌ కేసుల సంఖ్య మంగ‌ళ‌వారం ఉద‌యం నాటికి  దేశంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 10,363కు చేరుకుంది. ఇప్పటివరకు 339 మంది మృత్యువాతపడ్డారు. దేశ వ్యాప్తంగా 1035 కరోనా బాధితులు కొలుకున్నారని అధికార గణాంకాల ద్వారా తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లోనే దాదాపు 31 మంది క‌రోనా బారిన‌ప‌డి కన్నూమూశారు. 


భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్ లెక్క‌లు ఈవిధంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 10453 కేసులు,358 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు 8902 కేసులు ఆక్టివ్‌గా ఉన్నాయి. ఇక కోలుకున్న‌వారు 1193 మంది బాధితులు ఇంటికి చేరారు. మహారాష్ట్ర లో ఇప్ప‌టి వ‌ర‌కు 2334 కేసులు న‌మోదుకాగా క‌రోనా బారిన ప‌డి 160 మంది మృతి చెందారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 1510 కేసులు న‌మోదు కాగా 28 మంది మృతి చెందారు. తమిళనాడులో 1173 కేసులు న‌మోదు కాగా 11మంది మృతి చెందారు. రాజస్థాన్ లో 897 కేసులు, 11 మంది మృతి, మధ్యప్రదేశ్ లో 614 కేసులు,50 మంది మృతి చెందారు.

 

అలాగే తెలంగాణలో 592 కేసులు,17 మంది మృతి, గుజరాత్ లో 572 కేసులు, 26 మంది మృతి, ఉత్తరప్రదేశ్ లో 558 కేసులు,5 మృతి, ఆంధ్రప్రదేశ్ లో439 కేసులు,7 మృతి, కేరళలో 378 కేసులు,ఇద్దరు మృతి, జమ్మూకాశ్మీర్ లో 270 కేసులు, 4 మృతి, కర్ణాటక247 కేసులు,8 మంది మృతి, హర్యానాలో 196 కేసులు,3 మృతి, పంజాబ్ లో176 కేసులు,12 మంది మృతి, పశ్చిమ బెంగాల్ లో 152కేసులు,7 మృతి, బీహార్ 66 కేసులు, ఒకరు మృతి, ఒడిశా 55 కేసులు,ఒకరు మృతి చెందారు.ఇదిలా ఉండ‌గా నిజాముద్దీన్‌ ఘటన త‌ర్వాత దేశ రాజధాని దిల్లీలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కేవలం ఒక్కరోజే 356 పాజిటివ్‌ కేసులు న‌మోదుకావ‌డం గ‌మానార్హం. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు దిల్లీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1510కి చేరింది. వీరిలో 28మంది మృత్యువాతపడ్డారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: