సాధార‌ణంగా అమ్మాయిల‌ను బాగా ఇబ్బంది పెట్టే స‌మ‌స్య పీరియ‌డ్స్‌. నెల నెలా వచ్చే ఈ ఇబ్బందిని భరించడం అంత సుల‌భం ఏమీ కాదు. కానీ, భ‌రించాలి. రుతుక్రమం స్టాట్ అయిన‌ తర్వాత ప్రతి అమ్మాయినీ నెలకోసారి నెలసరి వచ్చి పలకరించి పోతుంటుంది. ఆ స‌మ‌యంలో ఆమె ప‌డే బాధ అంతా ఇంతా కాదు. అందులోనూ ముఖ్యంగా నెలసరి సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు. నెలసరి వచ్చినప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా కడుపు నొప్పి అధికంగా ఉంటుంది.

 

అయితే దీనికి సింపుల్ టిప్స్ చెక్ పెట్ట‌వ‌చ్చు. ఆరోగ్య పరంగా తులసికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పీరియడ్స్ టైంలో నొప్పి తగ్గడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. అందుకు ముందుగా తులసి ఆకుల్ని నీటిలో మ‌రిగించి.. చ‌ల్లారిన త‌ర్వాత కొంచెం కొంచెంగా రెండు మూడు గంటలకోసారి తాగితే క‌డుపు నొప్పి త‌గ్గుతుంది. అలాగే ఎవరైతే ఎక్కువ నొప్పి మరియు బ్యాక్ పెయిన్ మరియు స్టొమక్ పెయిన్ తో బాధపడుతుంటారో అలాంటి వారు అరటి ఆకును కొద్దిగా నూనెలో వేసి ఉడికించి, తర్వాత ఆకును పెరుగులో మిక్స్ చేసి తీసుకోవాలి.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అంతేకాకుండా.. పీరియడ్స్ టైమ్‌లో మ‌హిళ‌లు ఎక్కువగా హాట్ వాట‌ర్ బాత్‌ చేయడం మంచిది. వేడినీటి స్నానం వల్ల కండరాలపై ఒత్తిడి తగ్గడంతో పాటు రిలీఫ్‌ను ఇస్తుంది. కడుపు నొప్పి మరియు కాళ్లు చేతులు లాంటి స‌మ‌స్య‌ల‌కు వేడి నీటి స్నానం చెక్ పెడుతుంది. మ‌రియు ఖచ్చితంగా బలమైన ఆహారం తీసుకోవాలి. అలా పోష‌కాల‌తో కూడిన ఆహారం తీసుకోకుంటే మరింతగా కడుపు నొప్పి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: