ఎండాకాలం వచ్చిందటే ఆరోగ్య రక్షణకై మనం చేయని ప్రయత్నాలు ఉండవు. ఎండ దెబ్బ తగలకుండా ఉండటానికి మన రోజు వారి ఆహర పదార్ధాలు, తీసుకునే తిండి ఇలా ప్రతీ విషయంలో మార్పులు చేస్తాం. సహజంగానే ఎండాకాలంలో అధిక దాహం, శరీరం అలసటలకి ఎక్కువగా లోనవుతూ ఉంటాం. ముఖ్యంగా అధిక దాహం అందరిని ఇబ్బంది పెట్టె ముఖ్యమైన సమస్య. దీనికి అందరూ ఉపయోగించే ఏకైక పద్దతి ఒక్కటే..సబ్జా గింజలు పానీయం..

IHG

సబ్జా గింజలు వీటిని ఎండాకాలంలో అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి మార్కెట్ లో ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి. అయితే వీటిని వాడే పద్దతుల్లో చాలామంది రకరకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ సరైన పద్దతులలో వీటిని ఉపయోగిస్తేనే వీటియొక్క ఫలితాన్ని మనం పొందవచ్చు. సబ్జాలు ఒక స్పూన్ తీసుకుని మంచి నీటిలో వేసి ఉబ్బిన తరువాత కొందరు తీసుకుంటారు ఇదొక పద్దతి..

IHG

అలాగే నిమ్మరసం, పంచదార కలిపిన నీటిలో సబ్జాలు వేసి తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వలన సబ్జాలో ఉండే చల్లని గుణం, నిమ్మలో ఉంటే సిట్రిక్ యాసిడ్ , పంచదారా అన్నీ కలిసి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి అలాగే అధిక దాహం తీర్చేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రయాణాలు చేసే వారికి, ఎక్కడికైనా వెళ్ళే సమయంలో ఈ సబ్జా గింజల పానీయం తీసుకుని వెళ్తే వీటి ఫలితాని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ గింజలని చాలా మంది రాయనిక కూల్ డ్రింక్స్ లో కానీ లేదా ఫ్రూట్ మిక్చర్ పేరుతో కొన్ని రసాయనాలు కలిపినా జ్యూస్ లలో కానీ వాడకూడదు.

IHG

సబ్జా గింజలలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ క్రియకి ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. కడుపులో మంట, ఉబ్బసం అసిడిటీ లాంటి సమస్యలకి  సబ్జా గింజలతో చెక్ పెట్టేయచ్చు. అయితే షుగర్ ఉన్న వారు సబ్జా గింజల పానీయంలో షుగర్ వేసుకోకుండా తీసుకోవచ్చు. రక్తంలో గ్లూకోజ్ లెవిల్స్ ని కంట్రో చేయడంలో ఎంతో ఉపయోగ పడుతుంది. కడుపులో వికారం ఉన్న వాళ్ళు సబ్జా గింజల జ్యూస్ తాగితే ఉపశమనం కలుగుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: