నేటి కాలంలో అంద‌రూ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి అధిక బ‌రువు. ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు ఎక్సర్‌సైజులు, డైటింగులతో ఒళ్లు హూనం అయ్యేలా కష్టపడుతున్నా లాభం ఉండ‌డ‌క‌పోవ‌డంతో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. లావును తగ్గించుకోవడానికి ఎలాంటి మ్యాజిక్ లు ఉండవు. అది మ‌నీ జీవ‌న‌శైలి, ఆహార అల‌వాట్ల‌పైనే ఆదార‌ప‌డి ఉంటుంది. ఇక సాధార‌ణంగా బరువు తగ్గాలన్న కసితో కడుపు కాలుతున్నా నోరు కట్టేసుకుంటారు. కానీ, అది చాలా పొర‌పాటు. దీని వ‌ల్ల బ‌రువు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంది.

 

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. వేడి నీటిని ప‌ర‌గ‌డుపున తాగితే సులువు బ‌రువు త‌గ్గొచ్చు. ఉద‌యాన్నే రెండు గ్లాసుల వేడి నీటిని తాగితే శరీర మెటబాలిజం రేటు పెరిగి ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అయితే దీనికి కొన్ని నియ‌మాలు ఖ‌చ్చితంగా పాటించాలి. అప్పుడు బ‌రువు త‌గ్గ‌డం సులువు అవుతుంది. ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డానికి అర‌గంట ముందు ఒక గ్లాస్ వేడి నీటిని తాగితే క‌డుపు నొప్పి త‌గ్గుతుంది. ఇది క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేసేందుకు కూడా యూజ్ అవుతుంది.

 

అలాగే గోరు వెచ్చని నీరు ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున ఐదు గంటల సమయంలో నాలుగు గ్లాసుల నీరు త్రాగాలి. . ఒకేసారి నాలుగు గ్లాసుల నీరు తాగలేక పోతే ముందుగా ఒక గ్లాసు, తర్వాత రెండు గ్లాసులు ఇలా మెల్లగా అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా ప్ర‌తిరోజు చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అంతేకాకుండా, ప‌ర‌గ‌డుపున వేడి నీటిని తాగితే ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో ఉన్న మ‌లినాలు, చెడు ప‌దార్థాలు, వ్య‌ర్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. మ‌రియు జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: