కరోనా నియంత్రణలో భాగంగా వైయస్ జగన్ తొలిసారిగా టెలీ మెడిసిన్ ప్రారంభించారు. ఈ టెలీ మెడిసిన్ ను జాగ్రత్తగా నడపాలని ఆయన సూచించారు. అయితే వైఎస్ జగన్ ఇందుకుగాను 14410 టోల్ ఫ్రీ నెంబర్ ను కేటాయించారు ఈ నెంబర్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది అని చెప్పారు. ఈ విధానంలో టెలిఫోన్ ద్వారా సరైన సూచనలు , వైద్య సలహాలు మరియు సరైన  మందులను ఇస్తారు.

 

ఈ సేవలు ప్రారంభించి ఇప్పటికి  నాలుగు రోజులు కావస్తోంది .ఇప్పటివరకు వరకు 8243 మంది కి పైగా ఫోన్ కాల్స్ చేశారు.  4732 మందికి వైద్య సేవలు అందించినట్టు డాక్టర్లు చెప్తున్నారు. అదేవిధంగా 14410 కు రోజురోజుకు స్పందన పెరుగుతూ ఉంది. 14410 నెంబర్ కు ఫోన్ చేస్తే ఫోన్ ద్వారానే సలహాలు సూచనలు డాక్టర్ ద్వారా అందించబడతాయి. అవసరమైన మందులు పేషెంట్లకు ఇంటికే సరఫరా చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: