రోజు రోజుకి దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్  డౌన్ పొడిగిస్తూ నే ఉంది ప్రభుత్వం. నిత్యావసర సరుకుల కోసం బయటికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే.  మనం వాడే మాస్కులు కరోనా నుండి ఏ మాత్రం కాపాడలేవు దీనికి ప్రత్యామ్నాయం n-95 మాస్కులు మాత్రమే. వీటిని కొనాలంటే అధిక ధర వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణ ప్రజానీకానికి ఈ మాస్కులు కొనడం చాలా కష్టం. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజ-( ఐ ఐ  టి) ఢిల్లీ లోని అసిస్టెంట్ ప్రొఫెసర్  బిపిన్ కుమార్   కవచా మాస్క్ లను n95  ముసుగు లకు సరి అయిన ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేశారు.

 

కవచా మాస్కూల్లో 98%  కరోనా నీ నియంత్రించే సామర్థ్యం  ఉంటుందని ప్రొఫెసర్ చెబుతున్నారు దీనిలో త్రీ మైక్రాన్ పార్టికల్ సైజ్ ఫిల్టర్లను పొందుపరిచారు. దీని ధర కేవలం 45 రూపాయలు మాత్రమే. ఈ మాస్క్ లను ఆన్లైన్లో కూడా పొందవచ్చు. ఈ మాస్క్ లను  ఉతికి లేదా కడిగి కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇలా పది సార్లు ఉపయోగించుకోవచ్చు. బిపిన్ కుమార్ ప్రకారం n95 ముసుగులు కంటే కవచా ముసుగులు  చాలా ఉత్తమమైనవి అని చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: