కాలంతో సంభంధం లేకుండా మనం విరివిగా నిమ్మకాయలు వాడుతూ ఉంటాం. ఇక వేసవి కాలంలో అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు..నిమ్మకాయలకి మాంచి ఘిరాకి ఉంటుంది..జనాలకి దొరకనంతగా వాటిని వాడేస్తాము. శరీరానికి శక్తిని ఇవ్వడానికి, c విటమిన్ ని ఉత్పత్తి చేయడానికి శరీరం డీ హైడ్రేషన్ అవ్వకుండా ఉండటానికి నిమ్మకాయ ఎంతో దోహదం చేస్తుంది. చాలామంది ఏకంగా నిమ్మకాయని కోసి నేరుగా నాలికపై పిండుకుంటారు. అయితే నిమ్మకాయ తీసుకుంటే  ఎలాంటి మంచి గుణాలు ఉంటాయో నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటే అన్ని చెడు ఫలితాలు కూడా ఎదురవుతాయట.. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం..

IHG

నిమ్మరసం అధికంగా తీసుకుంటే మూత్రాశయం ఎక్కువ సేపు పనిచేయాల్సి ఉంటుంది. దాంతో మూత్రాశయం పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దాని ఫలితంగా మూత్రాశయ వ్యాధులు  పొంచి ఉంటాయి. ఇదిలాఉంటే స్వీట్స్ అధికంగా తీసుకున్నా చాక్లెట్ లు ఎక్కువగా తిన్నా పళ్ళు పాడయ్యిపోతాయని అంటుంటారు కానీ నిమ్మసరం ఎక్కువగా తీసుకుంటే చిగుళ్ళు పాడయ్యిపోతాయట. ముఖ్యంగా పంచదార కలుపుని త్రాగే వారికి ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు నిపుణులు..

IHG

నిమ్మసరం తాగిన తరువాత ఎవరికైనా తలనెప్పి వస్తే మాత్రం నిమ్మరసం తీసుకోవడం ఆపేయండి. ఎందుకంటె చాలామందికి నిమ్మరసం తీసుకోవడం వలన మైగ్రేన్ వస్తుంది..ఈ అనుభవం మనలో చాలా మంది అనుభవించే ఉంటారు..ఇక ముఖ్యంగా దంతాలు పాడయ్యి పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయట. నిమ్మరసం లో ఎసిడిక్  యాసిడ్ ఉంటుంది ఇది దంతాలపై ఉండే ఎనామిల్ ని దెబ్బ తీస్తుంది. దాంతో దంతాలు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. అందుకే వీరైనంత వరకూ నిమ్మరసం దంతాలకి తగలకుండా స్ట్రా లాంటివి వాడుతూ తీసుకోవచ్చు. అయితే ఈ ప్రభావాలన్నీ కేవలం నిమ్మరసం రోజుకి ఒక్క కాయకి మించి ఎక్కువగా తీసుకునే వారికి మాత్రమే కలిగే పరిణామాలని నిపుణులు సూచిస్తునారు.

మరింత సమాచారం తెలుసుకోండి: