ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఎక్క‌డ చూసినా  ప్ర‌జ‌ల్లో క‌రోనా భ‌య‌మే క‌నిపిస్తోంది. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక సతమతవుతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి కోరల్లో చిక్కుకుని దాదాపు అన్ని దేశాలూ విలవిలలాడుతున్నాయి. కొన్ని దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతోంది. దీంతో అటు ప్ర‌భుత్వం.. ఇటు ప్ర‌జ‌లు గంద‌ర‌గోళంలో ప‌డుతున్నారు. అయితే వాస్త‌వానికి ఇలాంటి వైర‌స్‌కు చెక్ పెట్టాలంటే భౌతిక దూరం, వ్య‌క్తిగత శుభ్ర‌త పాటించ‌డం మ‌రియు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం వంటివి త‌ప్ప‌కుండా చేయాలి.

 

ఈ నేప‌థ్‌యంలోనే ఇప్పుడు చెప్ప‌బోయే కొన్ని జ్యూసుల‌ను డైట్‌లో చేర్చుకుంటే ఎలాంటి వైర‌స్‌లు అయినా ప‌రార్ అవ్వాల్సిందే. ఇందులో ముందుగా బీట్‌రూట్‌ జ్యూస్‌.. బీట్‌ రూట్ జ్యూస్ రోజూ తాగితే ఐరన్ పెరుగుతుంది. అలాగే బ్లడ్ లో హిమోగ్లోబిన్‌ స్థాయి పెరుగుతుంది. రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగుతూ ఉంటే మెమోరీ పవర్ పెర‌గ‌డంతో పాటు రోగ‌నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతుంది. ఇక బ్రెయిన్ కావాల్సిన బ్లడ్ సప్లై అయ్యేలా బీట్ రూట్ చేయగలదు. మ‌రియు ప్ర‌తి రోజు బీట్ రూట్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల నీరసం పోయి ఫుల్ ఎనర్జీ వస్తుంది.

 

దానిమ్మ జ్యూస్‌..  దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పరగడుపునే దానిమ్మ జ్యూస్‌‌ తాగితే శరీరంలో ఉండే ఇన్‌ ఫెక్షన్లు త్వరగా తగ్గు తాయి. ఈ జ్యూస్ సహజమైన యాస్పిరిన్‌ లా పనిచేస్తుంది. దీని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే ప్ర‌తి రోజు ఈ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మ‌రియు మెదడును ప్రమాదానికి గురిచేసే ఫ్రీ రాడికల్స్‌ బారి నుండి దానిమ్మ ర‌క్షిస్తుంది. కాబ‌ట్టి, ఈ జ్యూసుల‌ను ఖ‌చ్చితంగా డైట్‌లో చేర్చుకోండి.
   

మరింత సమాచారం తెలుసుకోండి: