ప్రపంచ వ్యాప్తంగా కరోనా మ‌ర‌ణ మృదంగం కొన‌సాగిస్తోంది.  ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇక క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య ఏకంగా 29 లక్షలకు చేరువైంది. అయితే... మొత్తం కేసుల్లో మూడో వంతు, మరణాల్లో నాలుగో వంతు ఒక్క అమెరికాలోనే చోటుచేసుకున్నాయి.  స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌, టర్కీల్లో నమోదైన మొత్తం కేసుల కంటే ఇక్కడి కేసులే ఎక్కువగా ఉన్నాయి. ప‌రిస్థితి ఇంత భ‌యాన‌కంగా ఉన్నా అమెరికా మాత్రం లాక్‌డౌన్ ఎత్తివేత‌కు ఆస‌క్తి చూపుతుండ‌టం విశేషం. సామాజిక దూరం పాటిస్తూ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించేందుకు సిద్ధ‌ప‌డుతోంది. 

 

ఇప్ప‌టికే అమెరికాలోని పలు రాష్ట్రాలు చర్యలు స‌డ‌లింపులు చేప‌ట్ట‌డం విశేషం. జార్జియా, ఒక్లహామా, అలాస్కాలు లాక్‌డౌన్ నుంచి ష‌ర‌తుల‌తో కూడిన స‌డ‌లింపులు ఇవ్వ‌డం జ‌రిగింది.  శనివారం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్మీ డియాతో మాట్లాడుతూ- ‘‘గతవారంతో పోలిస్తే కొత్త కేసులు 38% నుంచి 28 శాతానికి తగ్గాయి. 18 రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయ‌ని తెలిపారు. ఇక లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపులు ఇచ్చేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిపారు. లూసియానాలో 7 రోజుల్లో పాజిటివ్‌ కేసులు 25% నుంచి 15 శాతానికి తగ్గాయ‌ని ట్రంప్ గుర్తు చేశారు. 

 

ఇదిలా ఉండ‌గా  కరోనాతో ఐరోపాలో సుమారు 1.20 లక్షల మంది మృతిచెందిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌టించింది. ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, బ్రిటన్‌లకు చెందిన వారి సంఖ్యే మొత్తం మ‌ర‌ణాల్లో మూడోవంతుగా ఉండ‌టం గమనార్హం.  శ్రీలంక నావికాదళంలో శుక్ర, శనివారాల్లో 60 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇజ్రాయెల్‌లో కరోనా బాధితుల సంఖ్య 15వేలను దాటింది.  బంగ్లాదేశ్‌లో 5 వేలు,  దక్షిణ కొరియాలో 10వేల కేసులు న‌మోద‌య్యాయి. ఇక బ్రెజిల్‌ ఆసుపత్రులన్నీ కొవిడ్‌ బాధితులతో నిండిపోయాయి. శ‌వాల‌ను సామూహికంగా ఖ‌న‌నం చేస్తున్నారు. అనేక ఆస్ప‌త్రుల్లో శ‌వాలు గుట్ట‌లుగా ప‌డి ఉంటున్నాయి.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: