నాకు షుగర్ ఉంది.. ఇప్పుడు ఈ ప‌దాలు వృద్ధులనే కాదు.. యువత‌లు కూడా చెబుతున్నారు. నేటి కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎంతో మందిని షుగ‌ర్ వ్యాధి వేధిస్తుంది. ఈ సమస్య కారణంగా తెగ ఇబ్బందిపడుతుంటారు. ముఖ్యంగా ఏది తినాలి..? ఏది తిన‌కూడ‌దు..? అని తెగ హైరానా ప‌డిపోతుంటారు. అయితే షుగ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌వారు నెయ్యి తిన‌వ‌చ్చా..? అన్న ప్ర‌శ్న చాల‌ మందికి వ‌చ్చింది. వాస్త‌వానికి నెయ్యి.. అంటే ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. నెయ్యి.. ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక వరం. పాల ఉత్పత్తుల్లో ఒకటి. 

 

పాల మీగడను చిలికించగా వచ్చే వెన్నను వేడి చేస్తే వచ్చేదే నెయ్యి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యిలో ఉండే కొలెస్ట్రాల్స్ శరీరానికి మంచిదని ..అది ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుందని పరీశోధకులు చెబుతున్నారు. దాన్ని రోజూ తినడం వల్ల అధికబరువు త్వరగా తగ్గుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నా ఈ నెయ్యి గురించి ఇటీవ‌ల కొన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌ప‌గా.. అందులో షుగర్ ఉన్నవారు కూడా నెయ్యి తినవచ్చని తేలింది. అయితే మోతాదు మించకూడదు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇంటిలో తయారుచేసిన నెయ్యి ఆరోగ్యానికి మ‌రింత బెట‌ర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 

ఇక సాధారణంగా షుగర్ ఉన్న వారిలో జీర్ణ సంబంధమైన సమస్యలు ఉంటాయి. వీరిలో ముఖ్యంగా మలబద్దకం సమస్య ఉంటుంది. వీరు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే జీర్ణ సమస్యలు తొలగిపోయి సాఫీగా విరేచనం అవుతుంది. అలాగే అన్నం, బ్రెడ్‌ వంటివి తిన్నప్పుడు వాటిలో ఉండే పిండిపదార్ధం కారణముగా రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. మ‌రియు నెయ్యిలో సమృద్ధిగా ఉండే లినోలీయిక్ యాసిడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: