మొద‌ట్లో అనుమానించిందే నిజ‌మ‌వుతోంది. వేడిప్రాంతాల్లో క‌రోనా చ‌చ్చిపోతోంది. వేడిమికి తాళ‌లేక మ‌టాష్ అవుతోంది. ఎండ ఎక్కువ‌గా ఉంటున్న ప్రాంతాల్లో వైర‌స్ త‌న సామ‌ర్థ్యాన్ని అత్యంత వేగంగా కోల్పుతూ న‌శిస్తున్న‌ట్లు భార‌తీయ శాస్త్ర‌వేత్త‌ల తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డికావ‌డం గ‌మ‌నార్హం. వైర‌స్ వ్యాప్తి ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో వైర‌స్ సంచారం..మ‌నుగ‌డ‌, వ్యాప్తి తీరు, వంటి చాలా అంశాల‌పై అధ్య‌య‌నం చేస్తున్న భార‌తీయ శాస్త్ర‌వేత్త‌ల‌కు ఈ కొత్త విష‌యం బోధ‌ప‌డిందంట‌. వాస్త‌వానికి మొద‌టి నుంచి కూడా వేడిమి ప్రాంతాల్లో క‌రోనా వైర‌స్ తొంద‌ర‌గా న‌శిస్తుంద‌న్న అనుమానాల‌ను శాస్త్ర‌వేత్త‌లు వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. 


అయితే ఉష్ణం అధికంగా ఉండే గ‌ల్ఫ్ దేశాల్లో కూడా వైర‌స్ ప్ర‌భావం క‌నిపించ‌డంతో ఇది నిజం కాద‌న్న నిర్ణ‌యానికి శాస్త్ర‌వేత్త‌లు వ‌చ్చారు. అయితే ఎండవేడిమికి తాళలేక చ‌నిపోవ‌డం నిజ‌మే అయినా సామాజిక దూరంతోనే దాన్ని పూర్తిగా దూరం చేయ‌గ‌ల‌వ‌ని ఇప్పుడు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. సామాజిక దూరం పాటించ‌క‌పోవ‌డం వ‌ల‌న తొంద‌ర‌గా వ్యాప్తి చెంద‌డంతోపాటు త‌న‌కు అవ‌స‌ర‌మైన ర‌క్ష‌ణను పొంద‌గ‌లుగుతోంద‌ని పేర్కొంటున్నారు. వాతావరణ పరిస్థితులతో పోలిస్తే.. భౌతిక దూరం, లాక్‌డౌన్‌ వంటి ప్రమాణాలే కొవిడ్‌పై పైచేయి సాధించడంలో అత్యంత కీలక ఆయుధాలని వారు స్పష్టం చేశారు. 


లాక్‌డౌన్‌తోపాటు భౌతిక దూరం ప్రమాణాలను పక్కాగా అమలుచేయడం వల్లే కేరళలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడం సాధ్యమైందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, శ్రీనగర్‌, న్యూయార్క్‌ల్లో పర్యావరణ పరిస్థితులు.. వైరస్‌ వ్యాప్తి తీరును నాగ్‌పుర్‌లోని ‘జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్‌ పరిశోధన ఇన్‌స్టిట్యూట్‌(నీరి)’ శాస్త్రవేత్తలు అధ్య‌య‌నాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నారు.  వాస్త‌వానికి వైరస్‌లు అధిక ఉష్ణోగ్రతల వద్ద తమ సామర్థ్యాన్ని కోల్పోతుంటాయి. ఇప్పుడు కరోనా వైర‌స్ కూడా అందుకు అతీత‌మేమీ కాద‌ని తేలిపోయింది.  స్వీయ జాగ్రత్తలతోనే వైరస్‌కు ముకుతాడు వేసే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: