అధిక బరువు.. నేటి కాలంలో చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక రక్తపోటు,గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అందుకే వైద్యులు కూడా మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే.. బరువు తగ్గమని సూచిస్తున్నారు. దీంతో ఈ అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి నానా తంటాలుప‌డుతూ ఉంటారు. ఎక్సర్‌సైజులు, డైటింగులతో ఒళ్లు హూనం అయ్యేలా కష్టపడ‌తారు. మ‌రియు  బరువు తగ్గాలన్న కసితో కడుపు కాలుతున్నా నోరు కట్టేసుకుంటారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితాలు లేక నిరాశ‌కు గుర‌వుతారు. 

 

అయితే అధిక బ‌రువుకు ఈజీగా చెక్ పెట్టాలంటే.. ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్స్ మీరు ట్రై చేయాల్సిందే. అందులో ముందుగా, కలబంద గుజ్జుని తీసుకుని మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. ఇలా తయారైన రసాన్ని కేవ‌లం రెండు స్పూన్స్ గ్రీన్‌టీ లో వేసుకుని తాగాలి. వాస్త‌వానికి కలబంద శరీరంలోని కొవ్వుని తగ్గిస్తుంది. అందువల్ల ఎంత బరువు ఉన్నా త్వరగా తగ్గుతారు. ఇందులో ఫైటో స్టెరాల్స్, విసిరల్ ఫ్యాట్స్ అలోవేరాలో అధికంగా ఉంటాయి. వీటికి కొవ్వు శాతాన్ని తగ్గించే సామర్థ్యం ఉంటుంది. అలాగే ద్రాక్ష రసం.. ఇది మరొక బరువు తగ్గించే డ్రింక్‌. ద్రాక్ష సిట్రస్ జాతికి చెందినదే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికం.

 

మ‌రియు ఇది శరీర కొవ్వును తేలికగా కరిగిస్తుంది. ఇక గ్రీన్‌టీ లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు. అలాగే సొరకాయ రసంలో నీరు, పీచు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ మీ బ్రేక్ ఫాస్ట్ లో ఒక్క గ్లాసెడు సొర రసం చేర్చుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలివ్వటమే కాక, మీ చర్మానికి కాంతి కూడా ఇస్తుంది. మన ఆకలిని మందగించి అధిక ఆహారం తీసుకోకుండా చేస్తుంది. కనుక బరువు తగ్గేందుకు సొర రసం కూడా బాగా పనిచేస్తుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: