క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారు చేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ల‌క్ష‌లాదిమంది శాస్త్ర‌వేత్త‌లు రేయిబ‌వ‌ళ్లు ఇందుకు కృషి చేస్తుండ‌టం గ‌మనార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌యోగాల్లో పురోగ‌తి క‌నిపిస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు వేర్వేరు ప్ర‌క‌ట‌న‌ల్లో పేర్కొంటూ వ‌స్తున్నారు. వ్యాక్సిన్ త‌యారు చేయ‌డంతోపాటు దాన్ని కారు చౌక‌గా అందించాల‌న్న‌దే శాస్త్ర‌వేత్త‌ల ధ్యేయంగా ఉంది. అమెరికాకు చెందిన ప్ర‌ముఖ ఔష‌ద సంస్థ‌లు  వచ్చే మూడు, నాలుగు నెలల్లో కరోనా నియంత్రణకు ఔషధం అందుబాటులోకి తీసుకురాగ‌ల‌మ‌ని చెబుతున్నాయి. ఇక వైరస్‌ సోకకుండా ముందుగా తీసుకునే టీకాలు(వ్యాక్సిన్‌) వచ్చే ఏడాది జులై నాటికి మార్కెట్లోకి వస్తాయని వెల్ల‌డిస్తున్నాయి. 

 

అయితే ఈ ప్ర‌యోగాల‌న్ని కూడా  క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయ‌ని చెబుతున్నాయి. మందులను మూడు దశల పరీక్షల అనంతరమే మార్కెట్లోకి పంపించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నేరుగా మూడోదశ పరీక్ష చేయడానికి నిబంధనల‌ను సడలించింది. ఔషధాల తయారీ తర్వాత ముందుగా అమెరికాకు ప్రాధాన్యమిస్తారు. ఆ తర్వాతే ఇతర దేశాలకు పంపిస్తార‌ని తెలుస్తోంది. ఇక అమెరికాలోనే అత్య‌ధికంగా కేసులు న‌మోదుకావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం చైనా నుంచి ల‌క్ష‌లాదిగా అమెరికన్లు రాక‌పోక‌లు సాగించ‌డ‌మేన‌ని తేలింది. 

 

వాస్త‌వానికి పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా ఉండే చైనాలో అమెక‌న్లు ఎక్కువ‌గా వ‌చ్చి వెళ్తుండేవారు. ఈ కార‌ణ‌మే అమెరికాలో వైరస్‌ ప్రభావం ఎక్కువ‌గా క‌నిపించ‌డానికి దోహ‌దం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌ అమెరికాతో పోల్చుకుంటే భారత్‌కు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కొన్ని వందల రెట్లు తక్కువ ఉండ‌టంతో ఇక్క‌డ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అంత‌గా మొద‌ట్లో క‌న‌బ‌డ‌లేదు. ఇప్పుడు ఉధృత‌స్థాయికి చేరుకుంది. గ‌డ‌చిన 24గంట‌ల్లోనే 2000ల‌కు చేరువ‌లో కేసులు న‌మోద‌య్యాయి. ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు జ‌రిగాయి. ఇక ముంబైలో క‌రోనా త‌న ప్ర‌తాపాన్ని చూపుతోంది. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: